News March 15, 2025

NRPT: జిల్లాకు మంచి పేరు తేవాలి: డీఈవో

image

నారాయణపేట మండలం జాజాపూర్ మండల పరిషత్ పాఠశాలలో శనివారం డీఈవో గోవిందరాజు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ తరగతుల శిక్షణకు ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. శిక్షణను పరిశీలించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాకు మంచి పేరు తేవాలని విద్యార్థులకు సూచించారు. సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News March 16, 2025

అల్లూరి జిల్లాలో ప్రతీ కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్: DEO

image

అల్లూరి జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 71 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని DEO బ్రహ్మాజీరావు తెలిపారు. జిల్లాలో పలు పరీక్ష కేంద్రాలో ఏర్పాట్లులను శనివారం ఆయన పరిశీలించి, టీచర్స్‌కు సూచనలు ఇచ్చారు. ప్రతీ కేంద్రంలో ఒక గెజిటెడ్ ఆఫీసర్, మరో సహాయ అధికారి సిట్టింగ్ స్క్వాడ్‌గా జిల్లా కలెక్టర్ నియమించారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 510మంది ఇన్విజిలేటర్లుని నియమించామన్నారు.

News March 16, 2025

ఒంగోలు రిమ్స్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

image

ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా నిన్న రాత్రి 11.30 గంటలకు ఒంటరిగా ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. క్యాజువాలిటీ వార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. అందులో సీనియర్ డాక్టర్ లేకపోవడాన్ని గుర్తించారు. సంబంధిత డాక్టర్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా కలెక్టర్ ఉన్నపళంగా ఆసుపత్రికి రావడంతో సిబ్బంది షాక్ అయ్యారు. మహిళా కలెక్టర్ రాత్రివేళ చెకింగ్ చేయడంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు.

News March 16, 2025

వరంగల్ అమ్మాయితో అమెరికా అబ్బాయి మ్యారేజ్❤️

image

వరంగల్‌కు చెందిన అమ్మాయితో అమెరికాకు చెందిన అబ్బాయికి ఆదివారం పెళ్లి జరగనుంది. కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన మాజీ కౌన్సిలర్ సంపత్- పద్మ దంపతుల రెండో కూతురు సుప్రియ ఐదేళ్ల క్రితం పై చదువుల కోసం అమెరికా వెళ్లింది. అదే కాలేజీలో చదువుతున్న గ్రాండ్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. దీంతో గ్రాండ్ తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకొనేందుకు సిద్ధమయ్యాడు. వీరి పెళ్లి వరంగల్‌లో నేడు జరగనుంది.

error: Content is protected !!