News January 31, 2025
NRPT: జిల్లా ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

నారాయణపేట పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వార్డులను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, ఎల్లప్పుడూ వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ మల్లికార్జున్ పాల్గొన్నారు.
Similar News
News December 2, 2025
‘మెగా పీటీఎం 3.Oకు రూ.9.84 కోట్లు కేటాయింపు’

ఈనెల 5న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో జరగనున్న మెగా పేరెంట్ టీచర్ డే (పి.టి.ఎం 3.0) కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.9.84 కోట్లు కేటాయించింది. రాష్ట వ్యాప్తంగా 45,190 సర్కారు పాఠశాలల్లో ఈ కార్యక్రమం జరగనుందని సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా పార్వతీపురం(D) భామిని ఏపీ మోడల్ స్కూల్లోని కార్యక్రమానికి సీఎం చంద్రబాబు పాల్గొంటారన్నారు.
News December 2, 2025
దిత్వా విధ్వంసం.. 465 మంది మృతి

దిత్వా తుఫాన్ శ్రీలంకలో పెను విషాదాన్ని మిగిల్చింది. కుండపోత వర్షాలు, వరదల బీభత్సం, కొండచరియలు విరిగిపడి ఇప్పటివరకు 465 మంది చనిపోయినట్లు లంక ప్రభుత్వం తెలిపింది. మరో 366 మంది గల్లంతయినట్లు పేర్కొంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. IND సహా పలు దేశాలు లంకకు మానవతా సాయం అందించిన విషయం తెలిసిందే. అటు దిత్వా ఎఫెక్ట్ తమిళనాడుపైనా తీవ్రంగా పడింది. APలో భారీ వర్షాలు కురిశాయి.
News December 2, 2025
గద్వాల: సైబర్ నేరాలపై అవగాహన ప్రచారం: ఎస్పీ

గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘సైబర్ ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ పోస్టర్ను ఆవిష్కరించారు. డిజిటల్ ప్రపంచంలో భద్రత పౌరుని హక్కు అని ఆయన అన్నారు. డిసెంబర్ 2 నుంచి జనవరి 12 వరకు పాఠశాలలు, గ్రామీణ ప్రాంతాల్లో సైబర్ అవగాహన శిబిరాలు కొనసాగుతాయని తెలిపారు. అనంతరం ఎస్పీ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు.


