News February 17, 2025
NRPT జిల్లా ఏర్పడి నేటికీ ఆరేళ్లు పూర్తి.!

నారాయణపేట కొత్త జిల్లాగా ఏర్పడి నేటికీ ఆరేళ్లు గడిచాయి. 2019 ఫిబ్రవరి 17న అప్పటి సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా 13 మండలాలు, 280 గ్రామ పంచాయతీలలో కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తూ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన జిల్లా ఏర్పాటు కోసం జిల్లా సాధన సమితి పేరుతో అనేక రకాలుగా ఆందోళనలు, నిరసనలు, దీక్షలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చి జిల్లాను ఏర్పాటు చేస్తూ ప్రకటించింది.
Similar News
News December 23, 2025
కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా గోపికృష్ణ, రాజ్ కుమార్

రాజన్నసిరిసిల్ల జిల్లా కోర్టుల్లో కేంద్రప్రభుత్వ వివిధ శాఖల తరఫున కేసులు వాదించేందుకు అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులను నియమిస్తూ భారత న్యాయమంత్రిత్వ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. వేములవాడకు చెందిన సీనియర్ న్యాయవాదులు కేశన్నగారి గోపికృష్ణ, రేగుల రాజ్ కుమార్‌లకు ఈ బాధ్యతలు దక్కాయి. ఇకపై జిల్లాలోని వివిధ న్యాయస్థానాల్లో కేంద్రప్రభుత్వానికి సంబంధించిన కేసులను వీరిద్దరూ పర్యవేక్షించనున్నారు.
News December 23, 2025
తిరుపతి ప్రజలకు గమనిక

తిరుపతి జిల్లాలో ఆసక్తి ఉన్నవాళ్లు ‘యువ ఆపద మిత్ర’కు దరఖాస్తు చేసుకోవాలని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి జి.విజయ్ కుమార్ కోరారు. 18 నుంచి 40ఏళ్ల లోపు అర్హులని చెప్పారు. ఈనెల 31వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ శిక్షణ పొందిన వారు జిల్లాలో ఏవైనా విపత్తులు జరిగినప్పుడు ప్రభుత్వం తరఫున సహాయక చర్యల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు.
News December 23, 2025
NRPT: ‘క్లెయిమ్ చేసుకోనని ఆస్తులను సొంతం చేసుకోండి’

బ్యాంకులలో వివిధ కారణాలతో క్లెయిమ్ చేసుకోలేని ఆస్తులను తిరిగి సొంతం చేసుకునేందుకు “మీ సొమ్ము మీ హక్కు” కార్యక్రమం చేపట్టినట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రెహమాన్ హాజరయ్యారు. పలువురు ఖాతాదారులకు సొమ్మును అందిస్తున్నట్లు పత్రాలను అందించారు. మూడు నెలల పాటు కార్యక్రమం ఉంటుందన్నారు.


