News February 1, 2025
NRPT జిల్లా బాల సదన్‌ను సందర్శించిన కలెక్టర్

నారాయణపేట జిల్లా కేంద్రంలోని సుభాష్ రోడ్‌లో ఉన్న బాల సదన్ (అనాధ ఆశ్రమం)ను శుక్రవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించారు. బాల సదన్ గదులు, కిచెన్‌ను చూశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. బాల సదన్‌లో నూతనంగా నిర్మించబోయే పలు నిర్మాణ పనుల స్థలాలను కలెక్టర్ పరిశీలించారు. అక్కడ కొత్తగా నిర్మించే పనులకు సంబంధించిన స్థలాలను పరిశీలించారు. సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News February 12, 2025
వరంగల్: స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికారులు

వరంగల్ జిల్లాలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయన్న సంకేతాలతో అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వరంగల్ జిల్లాలో మూడు మండలాల చొప్పున గ్రామపంచాయతీ ఎన్నికలకు రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ట్రైనింగ్ నిర్వహిస్తున్నారు. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికలకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేసేలా సమాయత్తం అవుతున్నారు.
News February 12, 2025
గ్రేటర్ HYD లైబ్రరీల్లో సిబ్బంది కొరత..!

గ్రేటర్ HYDలోని అనేక గ్రంథాలయాల్లో ఇప్పటికి సిబ్బంది లేక తీవ్రంగా ఇబ్బందులు కలుగుతున్నట్లు పాఠకులు తెలుపుతున్నారు. సెంట్రల్ లైబ్రరీ సహా, HYD కేంద్రంగా ఉన్న అనేక గ్రంథాలయాల్లో తృతీయ శ్రేణి రికార్డు సహాయకులు సైతం లేరు. గ్రంథాలయాలలో ఉన్న ఖాళీలన్నింటిని నింపాలని విద్యార్థులు, పాఠకులు డిమాండ్ చేస్తున్నారు.
News February 12, 2025
వైరా: నిలిచిపోయిన బీర్ల సరఫరా!

వైరాలోని IMFL డిపో నుంచి మంగళవారం బీర్ల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.150గా ఉన్న లైట్ బీర్ బాటిల్ ధర రూ.180కి, స్ట్రాంగ్ బీర్ బాటిల్ ధర రూ.40 మేర పెంచుతూ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు వెలువరించింది. అయితే నిన్న మధ్యాహ్నం వరకు స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో బార్లు, వైన్స్‌ల నిర్వాహకులు బీర్ల స్టాక్ తీసుకెళ్లలేదు. బుధవారం స్టాక్ తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.