News February 26, 2026

NRPT: డయల్ యువర్ డీఎం.. కాల్ చేయండి

image

డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. కోస్గి, నారాయణపేట డిపోల పరిధిలోని ప్రయాణికులు 7382826293 నంబర్‌కు ఫోన్ చేసి ఆర్టీసీ సేవలు, సమస్యలు, సలహాలు, సూచనలు ఫోన్ ద్వారా తెలియజేయాలని చెప్పారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

Similar News

News April 20, 2026

భర్త మృతిపై పోలీసుల ప్రమేయం లేదు: లక్ష్మి

image

దొంగతనం బయటపడటం, పాత కేసుల అవమాన భారంతోనే తన <<19694132>>భర్త<<>> వెంకటసుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య లక్ష్మి వెల్లడించారు. ఆదివారం రాత్రి అవుకు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనకు పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పోస్టుమార్టం అనంతరం కుమారుడు సుమంత్‌తో కలిసి ఆమె ఈ వివరాలు తెలిపారు. తమపై ఎవరి ఒత్తిడి లేదని పేర్కొన్నారు.

News April 20, 2026

నిజామాబాద్: భయ్యా ఎందుకంత స్పీడు..?

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రహదారి ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పోలీసులు జిల్లావ్యాప్తంగా ప్రమాదాలకు నిలయంగా మారిన 55 బ్లాక్ స్పాట్లను గుర్తించారు. 2024 లో 857 ప్రమాదాలు జరగగా, 353 మంది ప్రాణాలు కోల్పోయారు. 2025లో తీసుకున్న ముందస్తు చర్యల వల్ల ప్రమాదాలు 780కి, మరణాలు 276కి తగ్గాయి. అతివేగం, అజాగ్రత్త వల్ల వందలాది మంది క్షతగాత్రులుగా మారుతున్నారు.

News April 20, 2026

బెట్టింగ్.. ప్రకాశం జిల్లా యువకుడి అరెస్ట్

image

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పోలీసులు <<19692230>>బెట్టింగ్ ముఠా<<>>ను అరెస్ట్ చేశారు. ఉంగుటూరు మండలం గొల్లగూడేనికి చెందిన నరసింహాచార్యులును విచారించారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి అడ్డగా బెట్టింగ్ నడుపుతున్నట్లు తేలింది. ప్రకాశం జిల్లా ముండ్లమూరు(M) ఉల్లగల్లుకు చెందిన పర్వతనేని వేణుతో పాటు ఇతర జిల్లాలకు చెందిన గజ్జల రవీంద్ర రెడ్డి, పల్లెపాగ రవి, తులబంతుల తాండవ కృష్ణను అరెస్ట్ చేశారు.