News March 7, 2025
NRPT: డిజిటల్ లెర్నింగ్‌పై అవగాహన పెంచుకోవాలి

విద్యార్థులు డిజిటల్ లెర్నింగ్‌పై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. గురువారం నారాయణపేట మండలం జాజాపూర్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదివే విద్యార్థులతో డిజిటల్ లెర్నింగ్ పొందిన విద్యార్థుల ప్రజెంటేషన్ చూసి విద్యార్థులను కలెక్టర్ ప్రశంసించారు. గూగుల్ టూల్స్, ఈమెయిల్, వివిధ యాప్స్ వినియోగంతో స్కూల్ ప్రాజెక్టులు చేయడం చాలా బాగుందని విద్యార్థులు అన్నారు.
Similar News
News July 6, 2025
సింహాచలం గిరి ప్రదక్షిణకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

గిరి ప్రదక్షిణ రూట్లో వాహనాల రాకపోకలను నిషేధిస్తూ ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు. గిరి ప్రదక్షణలో పాల్గొనే భక్తులు వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు నిర్దేశిత ప్రాంతాలను గుర్తించామని తెలిపారు.
News July 6, 2025
‘అల్లూరి జిల్లాకు రూ.10కోట్ల నిధులు’

అల్లూరి జిల్లా ఆకాంక్ష జిల్లా కావడం వలన నీతి ఆయోగ్ రూ.10కోట్ల నిధులు విడుదల చేసిందని కలెక్టర్ దినేశ్ కుమార్ శనివారం తెలిపారు. ఆయా నిధులను విద్యాభివృద్ధికి వ్యయం చేస్తామన్నారు. జిల్లాలో 5 మోడల్ పాఠశాలలను ఏర్పాటు చేసి వాలీబాల్, కబడ్డీ, ఆర్చరీ, అథ్లెటిక్స్, రెజ్లింగ్ క్రీడల్లో శిక్షణ అందిస్తామన్నారు. ఫిజికల్ డైరెక్టర్లను, వ్యాయామ ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ అందిస్తామన్నారు.
News July 6, 2025
ప్రకాశం జిల్లా వాసులకు SP హెచ్చరిక

ప్రకాశం జిల్లా SP ఏ.ఆర్ దామోదర్ శనివారం పలు PSలలో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో కనిగిరి PSను సందర్శించి మాట్లాడారు. జిల్లాలో మొహర్రం వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వేడుకల్లో ఎక్కడైనా శాంతి భద్రతలకు విగాథం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.