News March 5, 2025
NRPT: తొలి రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

నారాయణపేట జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 16 కేంద్రాల్లో 4,476 మంది విద్యార్థులకుగాను 4,436 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై పరీక్షలు రాశారని, 140 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు తో పరీక్షలు జరిగాయి.
Similar News
News September 18, 2025
ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీ

ఆస్ట్రేలియా-Aతో లక్నోలో జరుగుతున్న తొలి అనధికార టెస్టు మొదటి ఇన్నింగ్స్లో IND-A ప్లేయర్ ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీ(113*) సాధించారు. తన ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. పడిక్కల్(86*), సాయి సుదర్శన్(73), జగదీశన్(64) అర్ధశతకాలతో రాణించారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 403 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన AUS-A 532/6కు డిక్లేర్ చేసింది.
News September 18, 2025
చింతపల్లి: యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

చింతపల్లి మండలం లంబసింగి ఘాట్ రోడ్డులో గురువారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. లంబసింగి పంచాయతీ వార్డు మెంబర్, శివాలయం అర్చకుడు వాడకాని రాజ్కుమార్ (35) నర్సీపట్నం వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఘాట్ 2వ మలుపులో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడని తెలిపారు.
News September 18, 2025
మోసపూరిత ప్రకటనలు నమ్మొద్దు: వరంగల్ పోలీసులు

సోషల్ మీడియా ద్వారా బంపర్ ఆఫర్లు, బహుమతుల పేరిట వస్తున్న మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని వరంగల్ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. తక్కువ ధరకే వస్తువులు ఇస్తామంటూ వచ్చే లింకులు, స్పిన్ వీల్ లేదా స్క్రాచ్ కార్డుల పేరుతో వచ్చే సందేశాలు పూర్తిగా మోసపూరితమని అధికారిక ఫేస్బుక్ పేజీ ద్వారా ప్రజలకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి లింకులను క్లిక్ చేయకుండా జాగ్రత్త వహించాలని కోరారు.