News August 12, 2024
NRPT: దంపతుల మధ్య గొడవ.. ప్రాణాలు కాపాడిన పోలీసులు
సూసైడ్ చేసుకుంటున్న వ్యక్తిని పోలీసులు కాపాడిన ఘటన నారాయణపేట మండలంలో జరిగింది. బండగొండకు చెందిన రాజు, సుజాత దంపతులు ఆదివారం సాయంత్రం గొడవ పడ్డాడు. అనంతరం గ్రామ శివారులోని గుట్టపైకి వెళ్లి పురుగు మందు తాగి చనిపోతున్నానని భార్యకు ఫోన్ చేశాడు. సుజాత వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించిన ASI బాలయ్య, కానిస్టేబుల్ ఆనంద్ టెక్నాలజీ సహాయంతో రాజు ఉన్న చోటుకు వెళ్లి కాపాడారు.
Similar News
News September 13, 2024
MBNR: కుల,మత సామరస్యతకు వారు నిదర్శనం
కుల,మత సామరస్యతకు ప్రతీకగా, భగవంతుడు సర్వాంతర్యామి అని మరోసారి రుజువైంది. చిన్నంబావి మండలం బెక్కెం గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిష్ఠించి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. గురువారం గణపతి మండపంలో నిర్వహించిన వేలంపాటలో లడ్డూను గ్రామ ముస్లిం సోదరులు తాజోద్దీన్, మహమ్మద్‌లు వేలం పాటలో పాల్గొని రూ.15వేలకు గణనాథుని లడ్డూను దక్కించుకున్నారు.
News September 13, 2024
‘ప్రజా పాలన దినోత్సవానికి ఏర్పాట్లు చేయండి’
జిల్లా కేంద్రంలో ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం నారాయణపేట కలెక్టరేట్ లో అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఎస్పీ పరేడ్ మైదానంలో సెప్టెంబర్ 17న ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు.
News September 13, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!
✒వర్షాల EFFECT.. దెబ్బతిన్న పత్తి పంట
✒NGKL:ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య
✒నేషనల్ కిక్ బాక్సింగ్‌లో కోటకొండ బిడ్డకు గోల్డ్ మెడల్
✒ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్
✒ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి:కలెక్టర్లు
✒GDWL: డ్రంక్&డ్రైవ్‌లో ఆరుగురిపై కేసు నమోదు
✒చట్టాన్ని అతిక్రమిస్తే శిక్షలు తప్పవు: న్యాయమూర్తి శ్రీలత
✒భారీ వర్షం..ఎకరానికి రూ.30 వేలు నష్టపరిహారం ఇవ్వాలి:CPI