News April 24, 2025

NRPT: ‘నకిలీ విత్తనాల అమ్మితే కఠినమైన చర్యలు’

image

నారాయణపేట జిల్లా పరిధిలోని ఆయా మండలాల్లో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మితే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ యోగేష్ గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. ఊళ్లల్లోకి ప్యాకెట్లలో కాకుండా లూసుగా విత్తనాలు తీసుకొస్తే రైతులు తీసుకోవద్దని ఎస్పీ రైతులను కోరారు. ఫర్టిలైజర్ షాపుల్లో ప్యాకింగ్ లేబుల్ ఉన్న విత్తనాలు మాత్రమే కొనుక్కోవాలని రైతులను ఎస్పీ సూచించారు.

Similar News

News August 23, 2025

నవంబర్‌లో ఇండియాకు లియోనల్ మెస్సీ!

image

ప్రపంచ దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ నవంబర్‌లో ఇండియాకు రానున్నట్లు కేరళ క్రీడాశాఖ మంత్రి వి.అబ్దుహ్మాన్ తెలిపారు. మెస్సీతోపాటు అర్జెంటీనా జట్టు మొత్తం కేరళకు వస్తుందని ఆయన ప్రకటించారు. తిరుప్పూర్ గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో జరిగే ఓ ఫ్రెండ్లీ మ్యాచులో అర్జెంటీనా తలపడనున్నట్లు పేర్కొన్నారు. కాగా అదే సమయంలో ముంబైలోని వాంఖడే స్టేడియంలో మెస్సీ క్రికెట్ కూడా ఆడతారని వార్తలు వస్తున్నాయి.

News August 23, 2025

భర్త, కుమార్తెను చంపిన భార్యకు జీవిత ఖైదు: VZM SP

image

కట్టుకున్న భర్తను, కన్న కూతూరిని హతమార్చిందో మహిళ. భీమిలి (M)కి చెందిన జ్యోతిర్మయి వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త రమేశ్‌ను ప్రియుడు రాము, మరో ఇద్దరి సహాయంతో చంపింది. ఈ సంఘటన చూసిన కుమార్తెను కొత్తవలసలోని బావిలో పడేశారు. VZM టూటౌన్ PSలో 2015లో హత్య కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో మహిళకు జీవిత ఖైదు, ఇద్దరికి ఏడేళ్ల శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని SP వకుల్ జిందాల్ తెలిపారు.

News August 23, 2025

మెదక్: NMMS రిజిస్ట్రేషన్‌.. ఈనెల 30తో ముగింపు

image

NMMS స్కాలర్‌షిప్‌ ఎంపికైన విద్యార్థుల రిజిస్ట్రేషన్‌ ఆగస్టు 30తో ముగియనుందని జిల్లా విద్యాశాఖాధికారి రాధా కిషన్‌ తెలిపారు. ఇంకా NSP పోర్టల్‌లో నమోదు చేయని విద్యార్థులు వెంటనే రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలని సూచించారు. ప్రీ-ఎన్రోల్‌ అభ్యర్థులను ప్రధానోపాధ్యాయులు, ఐఎన్‌ఓలు అర్హత నిబంధనల ప్రకారం ఆథరైజ్‌ చేయాలని కోరారు. గడువు దాటితే స్కాలర్‌షిప్‌ మంజూరుకు ఆటంకం ఏర్పడుతుందని పేర్కొన్నారు.