News March 17, 2025
NRPT: నిలువు రాళ్లను పరిశీలించిన మంత్రి జూపల్లి

ముడుమల్ గ్రామంలోని ప్రాచీన ఖగోళ శాస్త్రానికి చెందిన నిలువురాళ్లను ఆదివారం పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. యునెస్కో గుర్తింపు కోసం నిలువురాళ్లను పరిశీలిస్తుండటంతో మంత్రి పర్యటన ఆసక్తి రేపింది. ప్రాచీన కాలంలో నిలువురాళ్ల ద్వారా సమయాన్ని చెప్పేవారని గ్రామస్థులు పేర్కొన్నారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్, ఆర్డిఓ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 5, 2025
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు: కలెక్టర్

నిబంధనల ప్రకారం పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు చర్యలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం జోనల్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన పోలింగ్ అధికారులందరూ విధులకు హాజరయ్యేలా పర్యవేక్షించాలని అన్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగే రోజే ఉప సర్పంచ్ ప్రక్రియ ముగిసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
News December 5, 2025
ఆయుష్మాన్ భారత్ పథకంలో మధుమేహ రోగులను చేర్చాలి: ఎంపీ

ఆయుష్మాన్ భారత్ పథకంలో టైప్-1 మధుమేహం రోగులను, అవుట్ పేషెంట్ సేవలు కూడా చేర్చాలని ఎంపీ శ్రీ భరత్ పార్లమెంట్ సమావేశాల్లో కోరారు. ఇన్సులిన్, గ్లూకోజ్ లాంటి ముఖ్య ఔషధాలు ప్రజారోగ్య సంస్థల్లో నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇన్సులిన్ ఒక మందు మాత్రమే కాదని, జీవనాధారమన్నారు. వీటి లభ్యత, ధరల సమస్య కారణంగా ఎవరూ ప్రాణం కోల్పోకూడదని, ఈ విషయంలో కేంద్రం తక్షణమే స్పందించాలన్నారు.
News December 5, 2025
విశాఖ: పాఠశాలలో బాలికల వాష్రూమ్ వద్ద యువకుడి వెకిలి చేష్టలు

చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరుగుతున్న సమయంలో ఓ అపరిచిత వ్యక్తి అనుమానాస్పదంగా వ్యవహరించాడు. పాఠశాలలోకి ప్రవేశించిన యువకుడు బాలికల వాష్రూమ్ వద్ద వెకిలి చేష్టలకు పాల్పడుతుండటాన్ని విద్యార్థినులు గమనించారు. వెంటనే వారు ప్రధానోపాధ్యాయులు ములుగు వెంకటరావుకు సమాచారం అందించారు. ప్రధానోపాధ్యాయుడు తక్షణమే పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


