News March 19, 2025
NRPT: నూతన మండలం ఏర్పాటు చేయాలని సీఎంకు వినతి

NRPT జిల్లాలో కొటకొండ, గార్లపాడు గ్రామాలను నూతన మండలాలుగా ఏర్పాటు చేయాలని ఇల్లందు మాజీ MLA గుమ్మడి నర్సయ్య మంగళవారం హైదరాబాద్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో వినతి పత్రం అందించారు. మండలాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పరిశీలించి మండలాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. కొటకొండ గ్రామ ప్రజలు నర్సయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News November 16, 2025
రాజస్థాన్ చీఫ్ సెక్రటరీగా తెలుగు వ్యక్తి

రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలుగు IAS ఆఫీసర్ వోరుగంటి శ్రీనివాస్ నియమితులయ్యారు. కేంద్ర సర్వీసుల్లో పని చేస్తున్న ఈయనను RJ ప్రభుత్వం డిప్యుటేషన్పై రప్పించి సీఎస్ బాధ్యతలు అప్పగించింది. ఈయన 1966లో అరకు లోయలో జన్మించారు. భద్రాచలం, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు. 1989లో ఎంటెక్ పూర్తయ్యాక IASకు ఎంపికయ్యారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవరాలిని శ్రీనివాస్ వివాహం చేసుకున్నారు.
News November 16, 2025
SKLM: బంగారమంటూ పిలిచి.. బురిడీ కొట్టించాడు

ప్రేమిస్తున్నాని..పెళ్లి చేసుకుందామని ఆ యువతిని కుర్రాడు నమ్మించాడు. బంగారమంటూ పిలిస్తే..మురిసిపోయిందేమో యువకుడితో పెళ్లికి సిద్ధమైంది. శ్రీకాకుళానికి చెందిన వీరిద్దరూ HYDకు ఈనెల14న బయలుదేరారు. VJAలో బస్సు మారే క్రమంలో నగల బ్యాగ్, ఫోన్తో పారిపోయాడు. చావే దిక్కని ఏడుస్తున్న ఆమెను కృష్ణలంక పోలీసులు ప్రశ్నిస్తే విషయం తెలిసింది. దర్యాప్తు చేసి నగలతోపాటు యువతిని పేరెంట్స్కు నిన్న అప్పగించారు.
News November 16, 2025
వేరుశనగ పంట కోత.. ఇలా చేస్తే మేలు

వేరుశనగ పంటలో 75 నుంచి 80 శాతం కాయలు పూర్తిగా పక్వానికి వచ్చినప్పుడు మాత్రమే పంటను కోయాలి. పంటకోత కొరకు డిగ్గర్ యంత్రాన్ని, మొక్క నుంచి కాయలను వేరుచేయటానికి త్రైషర్ యంత్రాన్ని ఉపయోగిస్తే మంచిది. త్రైషర్ ద్వారా ఒక గంటకు 2 నుంచి 2 1/2 క్వింటాళ్ల కాయలను మొక్కల నుంచి వేరుచేయవచ్చు. ఇలా కూలీల కొరతను అధిగమించవచ్చు. కోత తర్వాత కాయలను బాగా ఆరబెట్టాలి. కాయల్లో తేమ ఎక్కువ లేకుండా చూసుకోవాలి.


