News August 12, 2024

NRPT: నేడు పాఠశాలల్లో ‘నషా ముక్త్ భారత్’ ప్రతిజ్ఞ

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సోమవారం ఉదయం ప్రార్థన సమయంలో మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ ప్రతిజ్ఞ నిర్వహించాలని డీఈవో అబ్దుల్ ఘని తెలిపారు. మాదకద్రవ్యాలతో కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతిజ్ఞ చేసిన చిత్రాలు, వీడియోలను విద్యాశాఖ అధికారులకు పంపించాలని, https:// nmba.dosje.gov.in/pledge-certificate ద్వారా ధృవపత్రం పొందాలన్నారు.

Similar News

News September 12, 2024

‘రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు-2024కు దరఖాస్తు చేయండి’

image

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు-2024 కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. క్రీడలు, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం తదితర రంగాల్లో కృషి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 18ఏళ్ల లోపు విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న వారు http://awards.gov.in లో సెప్టెంబర్ 15 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News September 12, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు !

image

❤ఉమ్మడి జిల్లా ఖోఖో సబ్ జూనియర్స్ బాల,బాలికల జట్లు ఎంపిక
❤ఆత్మకూరు: పందికి పాలు పట్టించిన ఆవు❤దేవరకద్ర: పొదల్లో నవజాత శిశువు లభ్యం❤BSC డిప్లమాలో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించిన పాలమూరు వాసి
❤MBNR:దొంగతనానికి వెళ్లి ఇద్దరు దుర్మరణం
❤కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:BJP
❤GDWL:Way2News ఎఫెక్ట్.. ప్రమాదకర విద్యుత్ వైర్లు తొలగింపు
❤కార్మికుల బకాయిలు చెల్లించండి:AITUC

News September 12, 2024

PDSU 50ఏళ్ల స్వర్ణోత్సవ సభ లోగో, పోస్టర్ ఆవిష్కరణ

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఈనెల 24న నిర్వహించే PDSU 50ఏళ్ల లోగో, స్వర్ణోత్సవ సభ పోస్టర్ ను PDSU మాజీ నేతలు బి.రాము, కాలేశ్వర్ ఆవిష్కరించారు. 1974లో PDSU ఏర్పడిన నాటి నుంచి 2024 వరకు మొక్కవోని దీక్షతో, విద్యారంగ సమస్యల పరిష్కారానికై తన వంతు కృషి చేసిందని వారు తెలిపారు. ఈ సమావేశంలో కాలేశ్వర్, దేవేందర్, అరుణ్, అంబదాస్, సాంబశివుడు, సాయి, మారుతి, సీతారాం, అజయ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.