News March 30, 2025

NRPT: ‘పండగలు శాంతియుతంగా చేసుకోవాలి’

image

పండుగలు కులమతాలకు అతీతంగా శాంతియుతంగా చేసుకోవాలని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ శనివారం ప్రకటనలో అన్నారు. జిల్లా ప్రజలకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండగ శుభాకాంక్షలు తెలిపారు. పండగను ప్రజలంతా ఉత్సాహంగా ఆనందోత్సవాల మధ్య నిర్వహించుకోవాలని అన్నారు. తీపి, చేదు, కష్ట సుఖాలు తెలిసిందే జీవితమని అన్నారు. పండగలకు ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Similar News

News December 2, 2025

చల్వాయి వార్డులను పంచుకున్న మూడు పార్టీలు..!

image

ములుగు జిల్లా గోవిందరావుపేట(M) చల్వాయి సర్పంచ్ స్థానాన్ని సయోధ్యతో కాంగ్రెస్ దక్కించుకుంది. 14 వార్డులను మూడు ప్రధాన పార్టీలు పంచుకున్నాయి. కాంగ్రెస్‌కు 7, BRSకు 4, BJPకి 3 చొప్పున తీసుకుంటూ తీర్మానించుకున్నాయి. ఉప సర్పంచ్ పదవిని BRSకు కేటాయించారు. పొలిటికల్ రింగ్‌లో నిత్యం తలపడే ఈ మూడు పార్టీలు పల్లె పోరులో మిత్రులుగా మారడం విశేషం. పదవుల పందేరంలో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని నిరూపణైంది.

News December 2, 2025

ఎన్నికల ఖర్చులకు కొత్త ఖాతా తప్పనిసరి: కలెక్టర్‌ తేజస్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయ వివరాల నమోదు కోసం తప్పనిసరిగా నూతన బ్యాంకు ఖాతా తెరవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ తేజస్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి అభ్యర్థి ప్రత్యేక ఖాతా కలిగి ఉండాలన్నారు. మూడో విడతలో నామినేషన్ వేయాలనుకునే వారు ముందుగానే కొత్త అకౌంట్ తీసుకుంటే నామినేషన్ ప్రక్రియ సులభమవుతుందని కలెక్టర్‌ సూచించారు.

News December 2, 2025

‘పాలమూరు ప్రాజెక్టులను గాలికొదిలేశారు’

image

సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధిఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తిచేసి సాగునీరు ఇవ్వాలని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మక్తల్ బహిరంగ సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి స్పందించారు. మాటలు కోటలు దాటుతున్నాయని, రెండేళ్ల పాలనలో ఒక్క పని కూడా చేసింది లేదని విమర్శించారు. రైతులను గాలికి వదిలేసి బోనస్ అని బోగస్ మాటలతో మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు.