News June 13, 2024
NRPT: పట్టపగలు కారు అద్దాలు పగలగొట్టి చోరీ

నారాయణపేటలో గురువారం పట్టపగలు చోరీ జరిగింది. స్థానిక సరాఫ్ బజార్లో నిలిపి ఉంచిన కారు అద్దాలు పగల గొట్టి దుండగులు చోరికి పాల్పడ్డారు. కారులో రూ.3 లక్షల 70 వేలు ఉన్నాయని, వాటిని దుండగులు ఎత్తుకెళ్లారని కోస్గికి చెందిన బాధితుడు చెప్పాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దుకాణాల్లోని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు.
Similar News
News October 2, 2025
మహబూబ్నగర్: ఎస్పీ కార్యాలయంలో గాంధీ జయంతి

జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీజీ సత్యం, అహింస, సమానత్వం కోసం జీవితాంతం పోరాటం చేశారని ఆమె కొనియాడారు. ఆయన బోధనలు నేటికీ ప్రతి ఒక్కరికీ మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయని ఎస్పీ పేర్కొన్నారు.
News October 2, 2025
మహబూబ్నగర్: దసరాకు నిరంతర పెట్రోలింగ్: ఎస్పీ

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి ఎస్పీ డి.జానకి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా ప్రజల జీవితాల్లో సంతోషం, విజయం నిండాలని ఆకాంక్షించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లావ్యాప్తంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, నిరంతర పెట్రోలింగ్ కొనసాగుతోందని ఆమె వెల్లడించారు.
News October 1, 2025
MBNR: AHTU.. 14 అవగాహన కార్యక్రమాలు- SP

మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (AHTU) ఆధ్వర్యంలో సెప్టెంబర్ నెలలో పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలలో 14 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. పిల్లలు– మహిళలను మాయమాటలు చెప్పి అక్రమ రవాణా చేసే వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద సమాచారం తెలిసిన వెంటనే డయల్100కు సమాచారం ఇవ్వాలన్నారు.