News March 21, 2025
NRPT: పరీక్షలకు 7,613 మంది విద్యార్థులు హాజరు

నారాయణపేట జిల్లాలో శుక్రవారం జరిగిన మొదటి రోజు పదో తరగతి పరీక్షలకు 7,613 మంది విద్యార్థులు హాజరు కాగా, 22 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా విద్యా శాఖ అధికారి గోవిందరాజు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు చెప్పారు. పలు పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లు తనిఖీలు చేశారని అన్నారు.
Similar News
News November 7, 2025
RGM: 12న క్యాబినెట్ మీటింగ్ వల్ల 16వ తేదీకి వాయిదా

సింగరేణి సంస్థలు మెడికల్ పూర్తిచేసిన 473 మంది అభ్యర్థులు ఈనెల 16న కొత్తగూడెంలో నిర్వహించే కార్యక్రమాలలో నియామక పత్రాలు తీసుకుంటారని ఐఎన్టీయుసీ రామగుండం నాయకులు గడ్డం తిరుపతి యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కారుణ్య నియామకం పద్ధతిలో అభ్యర్థులు ఉపాధి పొందనున్నారని అన్నారు. 12న క్యాబినెట్ మీటింగ్ వల్ల 16వ తేదీకి వాయిదా వేయడం జరిగిందన్నారు.
News November 7, 2025
GDK: బంగారు పతకాలు అందుకున్న ఎంబీఏ విద్యార్థులు

గోదావరిఖని యూనివర్సిటీ పీజీ కళాశాలకు చెందిన ఆరుగురు ఎంబీఏ విద్యార్థులు బంగారు పతకాలను అందుకున్నారు. అత్యుత్తమ మార్కులు సాధించినందుకు గాను డీ.తరుణ, ఎం.మౌనిక, డీ.ఉషశ్రీ, పీ.కళ్యాణి, కే.కళ్యాణి, సీహేచ్.సాగరికలు బంగారు పతకాలకు ఎంపికయ్యారు. శాతవాహన యూనివర్సిటీలో జరిగిన ద్వితీయ స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్ విష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఈ బంగారు పతకాలు అందుకున్నారు.
News November 7, 2025
GNT: సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

శంకర కంటి ఆసుపత్రి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 9న సీఎం చంద్రబాబు విచ్చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్ తమీమ్ అన్సారియా పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. పెదకాకాని మండలంలో హెలిపాడ్, సీఎం పాల్గొనే ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఇతర అధికారులు పాల్గొన్నారు.


