News February 19, 2025

NRPT: పాపం పసిపాప.. అప్పు తెచ్చినా బతకలేదు

image

వేడి నీరు పడి తీవ్రంగా గాయపడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నర్వ మండలంలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. మండలానికి చెందిన మనీష, రాజేశ్ దంపతులకు ఐదు నెలల తనుశ్రీ ఉంది. నెల క్రితమే చిన్నారికి నామకరణం చేశారు. ఈనెల 13న మనీష కుమార్తెను ఎత్తుకుని, వేడి నీటి బకెట్‌ని తీసుకెళ్తుండగా జారిపడింది. ఆ నీరు పడి తల్లీకుమార్తెకు గాయాలయ్యాయి. దాదాపు రూ.2.5లక్షల అప్పుచేసి, చూపించినా పాప దక్కలేదు.

Similar News

News February 26, 2026

హైదరాబాద్-విశాఖ ప్రయాణం ఇక ఈజీ

image

తెలుగు రాష్ట్రాల మధ్య తొలి ఫోర్ లేన్ యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే(NH-365BG) పనులు దాదాపు పూర్తయ్యాయి. TGలోని ఖమ్మం నుంచి APలోని దేవరపల్లి(తూ.గో.) వరకు 162KMల రహదారిని రూ.4,451 కోట్లతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్-వైజాగ్ ప్రయాణ సమయం 12 గంటలు ఉండగా ఇది అందుబాటులోకి వస్తే టైమ్ భారీగా తగ్గనుంది. ఈ హైవేను ప్రధాని మోదీ మేలో ప్రారంభించనున్నారు.

News February 26, 2026

NH-365BG ప్రత్యేకతలివే..

image

ఖమ్మం-దేవరపల్లి మధ్య నిర్మిస్తోన్న 4 లేన్ల NH-365BGకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ హైవేపై అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కింద ప్రతి 2KMలకు ఒకటి చొప్పున 95 CCTVలు ఉంటాయి. ఈ రూట్‌లో ఎక్కడైనా ప్రమాదం జరిగితే వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందుతుంది. రహదారి మొత్తం సోలార్ లైట్లు ఉంటాయి. 5KMకు ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. ఈ రోడ్డులో ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ ఛార్జీ చెల్లించాలి.

News February 26, 2026

నెల్లూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్‌తో ఒకరి మృతి?

image

నెల్లూరు జిల్లా బిట్రగుంట మండలం నాగులవరానికి చెందిన టీడీపీ నాయకుడు(47) చనిపోయారు. కావలిలో నివాసం ఉండే ఆయన వారం కిందట పొలం పనులకు వెళ్లినప్పుడు కాలికి ఏదో కుట్టినట్లు అనిపించింది. తర్వాత జ్వరం రావడంతో ఆసుపత్రికి వెళ్లారు. ఎంతకి తగ్గకపోవడంతో చెన్నైకి తీసుకెళ్లారు. ఈనెల 24వ తేదీ చనిపోయారు. స్క్రబ్ టైఫస్‌తో మరణించినట్లు డాక్టర్లు రిపోర్టు ఇచ్చారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.