News February 19, 2025

NRPT: పాపం పసిపాప.. అప్పు తెచ్చినా బతకలేదు

image

వేడి నీరు పడి తీవ్రంగా గాయపడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నర్వ మండలంలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. మండలానికి చెందిన మనీష, రాజేశ్ దంపతులకు ఐదు నెలల తనుశ్రీ ఉంది. నెల క్రితమే చిన్నారికి నామకరణం చేశారు. ఈనెల 13న మనీష కుమర్తెను ఎత్తుకుని, వేడి నీటి బకెట్‌ని తీసుకెళ్తుండగా జారిపడింది. ఆ నీరు పడి తల్లీకుమార్తెకు గాయాలయ్యాయి. దాదాపు రూ.2.5లక్షల అప్పుచేసి, చూపించినా పాప దక్కలేదు.

Similar News

News December 5, 2025

విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యం: కలెక్టర్

image

తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అనుసంధానాన్ని బలోపేతం చేసి విద్యార్థుల సమగ్ర అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మెగా పీటీఎం-3.0 విజయవంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. శుక్రవారం అమలాపురం మండలం పితాని వారి పాలెం ప్రాథమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుల ద్వారా విద్యార్థుల నైపుణ్యాలను పరిశీలించారు.

News December 5, 2025

కడపలో ఆచూకీ లేని 51వేల రేషన్ కార్డుదారులు..!

image

కడప జిల్లాలో 51,961 మంది రేషన్ కార్డుదారుల ఆచూకీ లేదు. దీంతో వారికి పంపిణీ చేయాల్సిన కార్డులు మిగిలిపోయాయి. జిల్లాకు 5,73,675 స్మార్ట్ కార్డులు రాగా వీటిలో 5,21,714 కార్డులు మాత్రమే పంపిణీ చేశారు. కడపలో 15,732, బద్వేల్‌లో 12,223, జమ్మలమడుగులో 18,906, పులివెందుల డివిజన్‌లో 5,100 కార్డులు మిగిలిపోయాయి. కార్డుల్లో ఉన్న అడ్రస్సుల్లో లబ్ధిదారులు లేకపోవడంతో వాటిని అధికారులు పంపిణీ చేయలేదు.

News December 5, 2025

నల్గొండ: ప్రతి విద్యార్థికి ఉపకార వేతనం అందాలి: కలెక్టర్

image

నల్గొండ జిల్లాలోని ప్రతి పేద విద్యార్థి ఉపకార వేతనం (స్కాలర్‌షిప్‌) పొందేలా అధికారులు మానవతా దృక్పథంతో పని చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. కలెక్టరేట్‌‌లో ఎంఈఓలు, సంక్షేమ శాఖల అధికారులతో ఆమె పాఠశాల విద్యార్థుల స్కాలర్‌షిప్‌ మంజూరుపై సమీక్ష నిర్వహించారు. దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని, ఏ ఒక్క పేద విద్యార్థి కూడా స్కాలర్‌షిప్‌ కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.