News March 14, 2025

NRPT: ‘పార్టీల ప్రతి నిధులతో సమావేశాలు నిర్వహించాలి’

image

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వివిధ రాజకీయ పార్టీల నేతలతో ఈనెల 19లోపు సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ పాల్గొన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఓటర్ జాబితాలో సవరణలు చేపట్టాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలన్నారు.

Similar News

News March 22, 2025

కర్నూలులో పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలు ఇలా..!

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.
☞ ఉదయ 9.45 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు
☞ 9.50 గంటలకు రోడ్డు మార్గాన ఓర్వకల్లు మండలం పూడిచెర్లలో నీటి కుంటల తవ్వకాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు
☞ 11.40 గంటలకు తిరిగి విమానాశ్రయం చేసుకుని బేగంపేట వెళ్తారు.

News March 22, 2025

VZM: జాగ్రత్త.. తేదీలను చింపేసి మరీ అమ్మకాలు!

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాప్స్, ఏజెన్సీలపై విజిలెన్స్ తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ తనిఖీల్లో నివ్వెర పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ధనార్జనే ధ్యేయంగా కొంతమంది అక్రమార్కులు అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మత్తును కలిగించే ఔషధాలను ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్నారు. వాటిపై ముద్రించిన తయారీ, ఎక్స్‌పైరీ తేదీలను చించి మరీ అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు.

News March 22, 2025

గండేపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

గండేపల్లి మండలం మురారి గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. జాతీయ రహదారిని శుభ్రపరిచే వాహనాన్ని రాజమండ్రి నుంచి వస్తున్న లారీ ఢీకొంది. దీంతో రోడ్డుపై కోన్లు పెడుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. గండేపల్లి ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

error: Content is protected !!