News March 26, 2025

NRPT: పోక్సో కేసులో నిందితుడికి 25 ఏళ్ల కారాగార శిక్ష

image

నారాయణపేట మండలానికి చెందిన మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో అత్యాచారం చేసిన ఘటనలో HYD బుద్వేల్ ప్రాంతానికి చెందిన వేముల అభిలాష్ అనే నిందితుడికి 25 ఏళ్ల కారాగార శిక్ష, రూ.60 వేల జరిమానా విధిస్తూ మంగళవారం నారాయణపేట జిల్లా న్యాయమూర్తి అబ్దుల్ రఫీ తీర్పు వెల్లడించారని ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. 2024 మార్చ్‌ 2న అమ్మాయి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్పీ చెప్పారు.

Similar News

News April 24, 2025

NLR: రేషన్ డీలర్ల వద్దకు పరుగులు

image

రేషన్‌ ఇంటికి రావాలంటే ప్రభుత్వం ఈకేవైసీ తప్పనిసరి చేసింది. రేషన్‌కార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలని ఆదేశించడంతో నెల్లూరు జిల్లాలోని లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. తమకు ఈకేవైసీ చేయండి అంటూ చాలామంది డీలర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉంది. ఈకేవైసీ స్టేటస్‌ ఇంటర్‌​నెట్​లోనూ చూసుకోవచ్చని అధికారులు సూచించారు.

News April 24, 2025

ఉగ్రదాడి ఘటనపై ముగిసిన అఖిలపక్ష భేటీ

image

పహల్‌గామ్‌ ఉగ్రదాడి ఘటనపై రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. అమిత్ షా, జైశంకర్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు. ఉగ్రదాడి తర్వాత తీసుకున్న చర్యలపై కేంద్రం వివరించింది. మరోవైపు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ రేపు శ్రీనగర్‌ వెళ్లనున్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో ఆయన అక్కడ పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

News April 24, 2025

కొత్తగూడెం: మత్స్యకారుల వలకు చిక్కిన మొసలి

image

మత్స్యకారుల వలకు మొసలి చిక్కిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని తుమ్మలచెరువులో జరిగింది. గురువారం కొందరు వ్యక్తులు చేపలు పట్టడానికి వెళ్లగా, వలలో మొసలి ప్రత్యక్షమైంది. భయాందోళనకు గురైన స్థానికులు విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలియజేయగా, ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మొసలిని గోదావరి నదిలో విడిచిపెట్టారు.

error: Content is protected !!