News May 4, 2024
NRPT: ‘పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి’
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులకు సూచించారు. శుక్రవారం నారాయణపేట గురుకుల పాఠశాలలో చేపట్టిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. అప్పటి వరకు నమోదైన ఓట్ల వివరాలను పిఓ, ఏపిఓ లను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 8 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తామని, దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News November 2, 2024
NRPT: సర్వే చేసేందుకు ఉపాధ్యాయుల జాబితా సిద్ధం చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించేందుకు ఉపాధ్యాయుల జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నారాయణపేట కలెక్టరేట్లో జిల్లా ప్రణాళిక, విద్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో సర్వే నిర్వహించేందుకు మొత్తం 1180 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులు, హెడ్మాస్టర్లు అవసరమని వారి పాత్ర కీలకమని అన్నారు.
News November 2, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!
✔MBNR:లా,ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటు పట్ల పలువురు హర్షం
✔భక్తులతో కిటకిటలాడిన కురుమూర్తి దేవాలయం
✔కిష్టంపల్లి: ముళ్లపొదలో పసికందు.. ఆసుపత్రికి తరలింపు
✔NGKL: డెంగ్యూతో బాలుడి మృతి
✔MBNR: 4న ఉమ్మడి జిల్లా స్థాయి యోగా ఎంపికలు
✔పలుచోట్ల దీపావళి వేడుకలు
✔మహమ్మదాబాద్: ఘనంగా మాజీ మంత్రి కమతం రాంరెడ్డి జయంతి వేడుకలు
✔పకడ్బందీగా కుటుంబ సర్వే: కలెక్టర్లు
✔కురుమూర్తి ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం
News November 1, 2024
MBNR: ఉమ్మడి జిల్లా నేటి ఉష్ణోగ్రత వివరాలు..
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. అత్యధికంగా వనపర్తి జిల్లా పానగల్ లో 34.0 డిగ్రీలు, గద్వాల జిల్లా అలంపూర్ లో 33.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నారాయణపేట జిల్లా బిజ్వార్లో 33.4 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా కోడేరులో 33.2 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా ఉడిత్యాలలో 32.1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.