News April 11, 2025
NRPT: ‘పౌష్టికాహారంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి’

పోషకాహార ప్రాముఖ్యతపై ఈనెల 22 వరకు నిర్వహించనున్న పోషణ పక్షం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం నారాయణపేట కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో పోషణ పక్షం గోడ పత్రికను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పిల్లలో ఊబకాయాన్ని తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. గర్భిణీలు, బరువు తక్కువగా ఉన్న పౌష్టికాహారం అందించాలన్నారు.
Similar News
News December 5, 2025
నాలుగు వేదాల ప్రతీక ‘తిరుమాడ వీధులు’

తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ 4 దిక్కులా ఉన్న వీధులను తిరుమాడ వీధులు అంటారు. వీటిని 4 వేదాలకు ప్రతీకగా భావిస్తారు. భగవద్రామానుజులవారు స్వామివారి ఊరేగింపుల కోసం వీటిని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి వాహన సేవలు ఈ పవిత్ర వీధులలోనే వైభవంగా జరుగుతాయి. వీటి పవిత్రత కారణంగా, ఈ మాడ వీధుల్లో పాదరక్షలు ధరించడం నిషేధం. ఈ వీధులు స్వామివారి వైభవాన్ని లోకానికి చాటిచెబుతాయి. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News December 5, 2025
సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరాళాలు ఇవ్వండి: కలెక్టర్

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ శుక్రవారం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ నిధికి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు విరివిగా విరాళాలు అందజేయాలని కోరారు. గోడపత్రికపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ సులభంగా విరాళాలను జమ చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
News December 5, 2025
కోతులను పట్టిస్తేనే.. సర్పంచ్‌గా గెలిపిస్తాం: మాదారం గ్రామస్థులు

భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలంలోని మాదారం గ్రామ ప్రజలు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా మారి, పంటలను నాశనం చేస్తుండటంతో ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారు కోతుల సమస్యను పరిష్కరించే అభ్యర్థినే తాము గెలిపిస్తామని గ్రామ ప్రజలు, యూత్ సభ్యులు స్పష్టం చేశారు.


