News March 11, 2025
NRPT: ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్

నారాయణపేట పట్టణంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతను ఇస్తూ వెంటనే పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు. మొత్తం 15 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ గరీమ నరుల, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
Similar News
News December 3, 2025
కాకినాడ: GOOD NEWS.. ‘ఈనెల 11 నుంచి శిక్షణ’

వాకిలపూడిలోని నైపుణ్యాభివృద్ధి సంస్థలో ఈనెల 11వ తేదీ నుంచి నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నట్లు వికాస పీడీ లచ్చారావు తెలిపారు. SSC లేదా ఆపై తరగతుల్లో ఉత్తీర్ణులైన వారికి ఈ శిక్షణ అందుబాటులో ఉంటుంది. మూడు నెలల శిక్షణ అనంతరం కేంద్ర ప్రభుత్వ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణ సమయంలో ఉచిత వసతి, భోజనం, యూనిఫాం కూడా అందిస్తారని పేర్కొన్నారు.
News December 3, 2025
కామారెడ్డి కలెక్టరేట్లో దివ్యాంగుల దినోత్సవం

కామారెడ్డి కలెక్టరేట్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, సివిల్ జడ్జ్ నాగరాణి పాల్గొన్నారు. దివ్యాంగుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పింఛన్లు, సహాయక పరికరాలు, నైపుణ్యాభివృద్ధి, లోన్ల వంటి పథకాలను వివరించారు. ఈ ఏడాది స్కూటీలు, లాప్టాప్లు, ట్రైసైకిళ్లు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. 28 మందికి లోన్లు, 15 మందికి వివాహ ప్రోత్సాహకంగా రూ.15 లక్షలు మంజూరు చేశారు.
News December 3, 2025
తిరుపతిలో హోటల్ ఫుడ్పై మీరేమంటారు..?

తిరుపతికి రోజూ లక్షలాది మంది భక్తులు, ఇతర ప్రాంత ప్రజలు వస్తుంటారు. ఈక్రమంలో వందలాది హోటళ్లు తిరుపతిలో ఏర్పాటయ్యాయి. నిబంధనల మేరకు ఇక్కడ ఫుడ్ తయారు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. నిల్వ చేసిన మాసం, ఇతర పదార్థాలతో వంటలు చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తూతూమంత్రంగానే తనిఖీలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వందలాది రూపాయలు తీసుకుంటున్నప్పటికీ హోటళ్లు నాణ్యమైన ఫుడ్ ఇవ్వడం లేదు. దీనిపై మీ కామెంట్.


