News March 11, 2025
NRPT: ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్

నారాయణపేట పట్టణంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతను ఇస్తూ వెంటనే పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు. మొత్తం 15 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ గరీమ నరుల, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
Similar News
News January 21, 2026
HYDలో లారియల్ తొలి గ్లోబల్ బ్యూటీ టెక్ హబ్

ప్రపంచంలోనే అతిపెద్ద కాస్మొటిక్ కంపెనీ లారియల్(L’Oréal) HYDలో తొలి గ్లోబల్ బ్యూటీ టెక్ హబ్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు దావోస్ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబుతో ఆ సంస్థ CEO నికోలస్ సమావేశమై చర్చించారు. నవంబర్‌లో జరిగే ప్రారంభోత్సవానికి CM రేవంత్, మంత్రి శ్రీధర్ బాబును ఆహ్వానించారు. ఆవిష్కరణలు, టెక్నాలజీ, Ai డేటాకు ఇది కేంద్రంగా పనిచేస్తుంది. భవిష్యత్తులో తయారీ కేంద్రం ఏర్పాటుకు సంస్థ ఆసక్తి చూపింది.
News January 21, 2026
మరో బ్లడ్ బాత్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఉదయం ఫ్లాట్‌గా మొదలై క్రమంగా కుప్పకూలాయి. నిఫ్టీ 25 వేల దిగువకు పడిపోయింది. 260 పాయింట్లు కోల్పోయి 24,950 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 935 పాయింట్లు పడి 81,250 వద్ద కొనసాగుతోంది. ట్రెంట్ షేర్లు 3%, ICICI బ్యాంక్ 2.52%, BE 2.1%, L&T 1.86% నష్టపోయాయి. అటు డాలర్‌తో పోలిస్తే మన కరెన్సీ విలువ సైతం భారీగా పడిపోయింది. డాలర్‌కు రూ.91.31 వద్ద ట్రేడవుతోంది.
News January 21, 2026
గుంటూరు జీజీహెచ్‌లో కొత్త బ్లాక్.. 30న సీఎం రాక

గుంటూరు జీజీహెచ్‌లో రూ.100 కోట్లతో నిర్మించిన నూతన MCH బ్లాక్‌ను ఈ నెల 30న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. పూర్వ విద్యార్థుల (GMCANA) సహకారంతో నిర్మించిన ఈ భవనంలో 597 పడకలు, ఆధునిక ICU సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాక, ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే తొలిసారిగా ఇక్కడ లివర్ మార్పిడి చికిత్సలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ‘జీవందాన్’ అనుమతి కూడా లభించింది.


