News February 3, 2025
NRPT: ప్రజావాణి ఫిర్యాదులను పెండింగులో పెట్టవద్దు: ఎస్పీ

ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. మొత్తం 5 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ చెప్పారు. ఆపదలో వుంటే డయల్ 100 ఫోన్ చేసి పోలీసుల సహాయం తీసుకోవాలన్నారు.
Similar News
News February 11, 2025
వికారాబాద్: 13న రైతులతో సంప్రదింపులు: కలెక్టర్

దుద్యాల మండలం లగచర్ల గ్రామ రైతులతో ఈనెల 13న సంప్రదింపుల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. వికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో సమావేశం హాల్‌లో ఈనెల 13న మధ్యాహ్నం 1:30 గంటలకు లగచర్ల గ్రామ శివారులోని సర్వే నంబర్ 102,117,120, 121, అసైండ్ భూమి సర్వే నంబర్ల రైతులతో భూమి ఎకరాకు పరిహారం నిర్ణయిస్తామన్నారు.
News February 11, 2025
స్టాక్‌మార్కెట్ల క్రాష్: 4 నెలల్లో ₹85లక్షల కోట్ల నష్టం

స్టాక్‌మార్కెట్లు పతనమవుతుండటంతో ఇన్వెస్టర్ల సంపద కనీవినీ ఎరగని విధంగా ఆవిరవుతోంది. గత SEP 27న నిఫ్టీ 26,277 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. నాటి నుంచి నేటి వరకు దాదాపుగా 3500 పాయింట్లు పడిపోయింది. అంటే 13% పతనమైంది. ఫలితంగా ఇన్వెస్టర్లు నవంబర్లో రూ.31L CR, డిసెంబర్లో రూ.10L CR, జనవరిలో రూ.27L CR, ఫిబ్రవరిలో రూ.15L CR మొత్తంగా సుమారు రూ.85 లక్షల కోట్ల సంపద కోల్పోయారు.
News February 11, 2025
సిద్దిపేట జిల్లాలో రూ.75 కోట్లతో ఆలయాల అభివృద్ధి: హరీశ్ రావు

సిద్దిపేట జిల్లాలో రూ.75 కోట్లతో దేవాలయాలను అభివృద్ధి చేశామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కొనాయిపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 15 నెలలుగా దేవాలయాలకు నిధులు విడుదల చేయడం లేదన్నారు. కొత్తగా ఒక్క దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయలేదు. గత ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులను నిలిపివేశారని ఆరోపించారు.