News April 7, 2025
NRPT: ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను పెండింగ్ పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులు సంబంధిత శాఖకు పంపించి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. మొత్తం 25 ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News October 17, 2025
నాగర్కర్నూల్ జిల్లాలో విషాదం.. యువకుడు ఆత్మహత్య

నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలం మూలమడత తండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. కుటుంబ కలహాలతో రాజు(30) బుధవారం ఇంటి నుంచి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయంపై అతడి అన్న రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఈరోజు కోడేరు ఎస్ఐ జగదీశ్వర్ తెలిపారు. మృతుడికి భార్య సరోజ, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.
News October 17, 2025
KNR: తీవ్ర ఉద్రిక్తత నడుమ అభిప్రాయాల సేకరణ

KNR జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవుల నియామక ప్రక్రియలో భాగంగా ఏఐసీసీ పరిశీలకులు శ్రీనివాస్ మానే గురువారం ముఖ్య నేతల అభిప్రాయాలను సేకరించారు. పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ, అభిప్రాయాల సేకరణ కొనసాగింది. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా ప్రత్యేక గదిలోకి వెళ్లి పరిశీలకులకు తమ అభిప్రాయాన్ని తెలిపారు.
News October 17, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓ కొత్తగూడెం ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి క్యాబినెట్ ఆమోదం
✓ చుంచుపల్లి: మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య
✓ మత్తు పదార్థాలు నియంత్రించాలని ఇల్లందులో పోలీసుల ర్యాలీ
✓ అశ్వాపురం: అక్రమంగా ఇసుక రవాణా.. 9 మందిపై కేసు
✓ మణుగూరు: అశోక్ నగర్లో పోలీసుల కార్డెన్ సెర్చ్
✓ భద్రాచలం: గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి
✓ బూర్గంపాడు: చెరువులో పడి వ్యక్తి మృతి
✓ జాతీయస్థాయిలో కరకగూడెం బిడ్డకు స్వర్ణం