News February 11, 2025
NRPT: ‘ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి’

ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను పరిశీలించి చట్టం ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. మొత్తం నాలుగు ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. భూముల సమస్యలు కోర్టు పరిదిలో పరిష్కరించుకోవాలని చెప్పారు.
Similar News
News November 21, 2025
ఖమ్మంలో ఫుట్ పాత్ల ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్

ఖమ్మం నగరంలోని ప్రధాన రోడ్లలో ఫుట్ పాత్ ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి అధికారులతో సమీక్షించారు. నగరంలో ప్రధాన రోడ్లలో ఫుట్ పాత్ల ఏర్పాటు, రోడ్డు ప్రమాదాల నియంత్రణ చర్యలపై చర్చించారు. వైరా రోడ్డు, బైపాస్, ఇల్లందు రోడ్డు వంటి 8 ప్రధాన రోడ్లకు ఫుట్ పాత్ల ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు.
News November 21, 2025
సంగారెడ్డి: ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

ప్రజలు ఆన్ లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పారితోష్ పంకజ్ శుక్రవారం తెలిపారు. ఎవరైనా ఆన్ లైన్ మోసాలకు గురైతే 48 గంటల్లో 1930, https://www.cybercrime.gov.in వెబ్ సైట్లో ఫిర్యాదు చేయాలని చెప్పారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కళాశాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
News November 21, 2025
రేపు ప్రకాశం జిల్లాకు మోస్తరు వర్ష సూచన.!

దక్షిణ అండమాన్లో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ప్రకాశం జిల్లాలో శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు. వ్యవసాయ మోటార్ల వద్ద రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా చలిగాలుల ప్రభావం పెరిగింది.


