News April 15, 2025
NRPT: ‘ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి’

ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని ఎస్పీ యోగేశ్ గౌతమ్ అన్నారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను పరిశీలించి చట్టం ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం నాలుగు అర్జీలు అందినట్లు చెప్పారు.
Similar News
News October 19, 2025
సిరిసిల్ల: ప్రభుత్వ జాప్యం.. దళారుల చేతికి ధాన్యం

జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం జాప్యమైతున్న కారణంగా రైతులు దళారులకు ధాన్యం అమ్మేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ సీజన్లో జిల్లాలో మొత్తం 1,84,360 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో 9,480 ఎకరాల్లో సన్న రకం,1,74,880 ఎకరాల్లో దొడ్డు రకం వేశారు.17,064 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం,4,37,200 మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం మొత్తం 4,54,264 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అన్నారు.
News October 19, 2025
పండ్ల తోటలు: కొమ్మల కత్తిరింపులో జాగ్రత్తలు

పండ్ల తోటల్లో కొమ్మ కత్తిరింపుల వల్ల సూర్యరశ్మి లోపలి భాగాలకూ చేరి ఎదుగుదల బాగుంటుంది. ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కత్తిరింపు పరికరాలను సోడియం హైపో/బ్లీచింగ్ పౌడర్ ద్రావణంలో ముంచిన తర్వాతే వాడుకోవాలి. లేదంటే ఏవైనా వ్యాధులు ఇతర చెట్లకు వ్యాపిస్తాయి. కత్తిరింపులు పూర్తయ్యాక చెట్ల భాగాలకు బ్లైటాక్స్ పేస్ట్/కాపర్ ఆక్సీక్లోరైడ్ పేస్ట్తో పూత వేయాలి. అధిక వర్షాలున్నప్పుడు కత్తిరింపులు చేయరాదు.
News October 19, 2025
ADB: కథలు చెప్తావనుకున్న తాత.. కానీ ప్రాణం తీశావ్..!

‘మా అమ్మానాన్న ప్రేమకు ప్రతిరూపం నేను. మరో నెలలో లోకం చూస్తాననుకున్నా.. అమ్మ ఒడిలో ఆడుకుంటానని, తాత చెప్పే కథలు వింటాననుకున్నా, పెద్దమ్మా పెద్ద నాన్న లాలిస్తారనుకున్నా.. కానీ కథలు చెప్పాల్సిన తాత కాల యముడయ్యాడు. పెద్దమ్మా పెద్ద నాన్న నా ఊపిరి తీశారు. నన్ను ఈ లోకం చూడకుండా చేశారు!’ కులాంతర వివాహం కారణంగా ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలో <<18047483>>గర్భస్త <<>>కోడలిని చంపిన ఘటనలో కడుపులోని శిశువు ఆవేదన ఇది.