News February 12, 2025
NRPT: ప్రేమికుల రోజు అడ్డుకుంటాం: బజరంగ్ దళ్

నారాయణపేటలో ప్రేమికుల రోజును అడ్డుకుంటామని బజరంగ్ దళ్ ఉమ్మడి పాలమూరు జిల్లా ఉపాధ్యక్షుడు శ్రవణ్, విహెచ్పి పట్టణ కార్యదర్శి ప్రవీణ్ అన్నారు. బుధవారం నారాయణపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రేమికులకు వ్యతిరేకం కాదని అన్నారు. 2019 ఫిబ్రవరి 14 రోజు పుల్వామా దాడిలో 40 మంది సైనికులు అమరులయ్యారని, ఫిబ్రవరి 14ను వీర జవాన్ల దినోత్సవంగా నిర్వహించుకుందామని చెప్పారు.
Similar News
News November 25, 2025
కృష్ణా: నాడు నేడు పనులు పూర్తి చేస్తే బాగు.!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాడు-నేడు పథకం కింద 80 నుంచి 90% వరకు పూర్తయిన పనులు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు లేక అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఎన్టీఆర్ జిల్లాలో 175, కృష్ణా జిల్లాలో 100 పైగా పాఠశాలల్లో అదనపు గదులు, మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. సుమారు 600 పైగా స్కూళ్లలో పెయింటింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
News November 25, 2025
GHMC కౌన్సిల్ హాల్‌లో తగ్గేదే లే!

GHMC కీలక సమావేశానికి వేదికైంది. మరో 3 నెలల్లో పాలకవర్గం ముగియనుంది. మేయర్ అధ్యక్షతన నేడు జరిగే సర్వసభ్య సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలు సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, కొన్ని అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలపనుంది. చర్చల్లో భాగంగా ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలని ప్రతిపక్షాలు, ధీటైన సమాధానం ఇచ్చేందుకు కాంగ్రెస్ సభ్యులు కూడా తగ్గేదే లే అంటున్నారు.
News November 25, 2025
అధిక సాంద్రత పత్తిసాగు – ఎందుకు ప్రత్యేకం?

ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 60 సెంమీ. ఎడం ఉండేలా నాటాలి. అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య 80 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి. దీంతో ఎకరం విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది.


