News March 8, 2025
NRPT: ఫర్టిలైజర్ డీలర్స్‌తో వ్యవసాయ శాఖ అధికారుల సమావేశం

విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విక్రయాల్లో ఫర్టిలైజర్ షాపుల డీలర్లంతా వ్యవసాయ శాఖ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ అన్నారు. శుక్రవారం నారాయణపేట మండల పరిధిలోని సింగారం గ్రామ రైతు వేదికలో జిల్లాలోని వివిధ గ్రామాల ఫర్టిలైజర్ డీలర్స్‌తో సమావేశం నిర్వహించి మాట్లాడారు. రికార్డులు సరిచూసుకొని, రాబోయే వర్షాకాలం రైతులకు అన్ని రకాల ఎరువులు, మందులను అందుబాటులో ఉంచాలన్నారు.
Similar News
News October 16, 2025
HYD: ఆన్లైన్లో అమ్మాయి.. మోసపోయిన అబ్బాయి!

ఆన్లైన్ డేటింగ్, ఫ్రెండ్షిప్ స్కామ్‌లో పడ్డ వ్యక్తి రూ.6,49,840 పోగొట్టుకున్నాడు. మలక్‌పేట్‌కు చెందిన వ్యక్తి (32)కి డేటింగ్ సైట్ ద్వారా ఓ అమ్మాయి పరిచయమైంది. పెళ్లి కుదురుస్తామని మాట్లాడి కొంత డబ్బు తీసుకుంది. అనంతరం ఓ ఫ్రెండ్షిప్ గ్రూప్‌లో యాడ్ చేసింది. అందులో ఉన్నవారి సూచనల మేరకు బాధితుడు విడతల వారీగా రూ.6,49,840 చెల్లించాడు. తర్వాత మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
News October 16, 2025
పత్తి కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి: కలెక్టర్

పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని, మద్దతు ధర పొందాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై మార్కెటింగ్, వ్యవసాయ, ఫైర్, విద్యుత్, జిన్నింగ్ మిల్ యాజమాన్యం వారితో గురువారం సమీక్షించి వారు మాట్లాడారు. జిల్లాలో మొత్తం 1,26,119.35 ఎకరాల్లో పత్తి సాగు అయ్యిందని, 1,38,731.285 టన్నుల పత్తి ఉత్పత్తి వస్తుందని అధికారులు అంచనా వేశారన్నారు.
News October 16, 2025
కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఎన్నికల అధికారిగా జగిత్యాల జిల్లా సహకార అధికారి సి.హెచ్.మనోజ్ కుమార్‌ను నియమించింది. సకాలంలో జరగాల్సిన ఎన్నికలు వివిధ కారణాల వల్ల వాయిదా పడ్డాయి. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించి నివేదిక సమర్పించాలని అథారిటీ ఆదేశించింది.