News March 8, 2025

NRPT: ఫర్టిలైజర్ డీలర్స్‌తో వ్యవసాయ శాఖ అధికారుల సమావేశం

image

విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విక్రయాల్లో ఫర్టిలైజర్ షాపుల డీలర్లంతా వ్యవసాయ శాఖ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ అన్నారు. శుక్రవారం నారాయణపేట మండల పరిధిలోని సింగారం గ్రామ రైతు వేదికలో జిల్లాలోని వివిధ గ్రామాల ఫర్టిలైజర్ డీలర్స్‌తో సమావేశం నిర్వహించి మాట్లాడారు. రికార్డులు సరిచూసుకొని, రాబోయే వర్షాకాలం రైతులకు అన్ని రకాల ఎరువులు, మందులను అందుబాటులో ఉంచాలన్నారు.

Similar News

News February 18, 2026

5,35,499 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ: DMHO

image

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో 1-19 సం.లలోపు ఉన్న 5.75,806 పిల్లలలో 5,35,499 మందికి ఆల్బెండజోల్ మాత్రలు మింగించినట్లు DMHO డాక్టర్ వి.సుజాత తెలిపారు. మొత్తంగా 93% ప్రగతి సాధించినట్లు తెలిపారు. మిగిలిన వారికి ఈనెల 24వ తేదీన ఇవ్వనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

News February 18, 2026

25,487పోస్టులు.. పరీక్ష వాయిదా

image

CAPFS, SSF, అస్సాం రైఫిల్స్‌లో ఖాళీగా ఉన్న 25, 487 కానిస్టేబుల్ (<>GD<<>>) పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 23న పరీక్ష జరగాల్సి ఉండగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాయిదా వేసింది. త్వరలో పరీక్ష తేదీలను ప్రకటించనున్నట్లు వెల్లడించింది. పరీక్షకు 8/10రోజుల ముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు, 2/3రోజుల ముందు అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. వెబ్‌సైట్: https://ssc.gov.in/

News February 18, 2026

భారీగా పెరిగిన అరటి ధరలు.. గెల ఎంతంటే?

image

AP: అరటి ధరలకు రెక్కలొచ్చాయి. JAN వరకు కర్పూర చక్కెరకేళి, తెల్ల చక్కెరకేళి, ఎర్ర చక్కెరకేళి గెల ₹200-300 ఉండేది. ఇప్పుడు ₹700-1000కి పెరిగింది. ఏప్రిల్ వరకు ఇవే ధరలు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. ఉమ్మడి తూ.గో, ప.గో జిల్లాల్లో అరటిని ఎక్కువగా సాగు చేస్తారు. గత 3ఏళ్లుగా తక్కువ ధరలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టాలు రావడంతో సాగు విస్తీర్ణం తగ్గింది. డిమాండ్‌కు తగ్గట్లు అరటి మార్కెట్లోకి రావట్లేదు.