News March 20, 2025
NRPT: బడ్జెట్ పత్రాలు దహనం చేసిన నేతలు

బడ్జెట్‌లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించారని నిరసన వ్యక్తం చేస్తూ గురువారం నారాయణపేట నర్సిరెడ్డి చౌరస్తాలో PDSU నాయకులు బడ్జెట్ పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ మాట్లాడుతూ.. బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం 7.57శాతం నిధులు కేటాయించారని, ఇది విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర అని అన్నారు. కనీసం 30 శాతం నిధులు కేటాయించి విద్యపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.
Similar News
News February 24, 2026
జిల్లాలో ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

ఆసిఫాబాద్ జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ హరిత తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 19 కేంద్రాల్లో 9,716 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. విద్యార్థులకు తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు.
News February 24, 2026
ADB: 108 సిబ్బంది సేవలు అభినందనీయం

ఆపద సమయంలో 108 అంబులెన్స్ సిబ్బంది సేవలు అభినందనీయమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్ జిల్లా 108, 102 ఉత్తమ సేవల్లో హైలెట్ బెస్ట్ ఈఎంటీ, పైలట్ అవార్డులను మంగళవారం కలెక్టర్ అందజేశారు. ఈఎంటీ రేఖ, రాజేశ్వర్, పైలట్ శివకుమార్ ఈ అవార్డులను అందుకున్నారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ సామ్రాట్, జిల్లా కోఆర్డినేటర్ శేఖర్, మనోహర్ వసీం పాల్గొన్నారు.
News February 24, 2026
హనుమకొండ: పార్టీ నుంచి బీజేపీ నేత సస్పెండ్

పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారన్న కారణంతో హనుకొండ జిల్లా రెడ్డిపురానికి చెందిన బీజేపీ నేత కన్నెబోయిన రాజయ్య యాదవ్‌పై పార్టీ వేటు వేసింది. పార్టీ నియమావళికి విరుద్ధంగా వ్యవహరించడంతో పాటు, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించినందుకు ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.


