News February 5, 2025
NRPT: బావిలో మునిగి బాలుడు మృతి

వనపర్తి జిల్లా అమరచింత మండలం చంద్రప్ప తాండ శివారు బావిలో ఈతకు వెళ్లి ఓ బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. చిన్నచింత కుంట మద్దూరుకి చెందిన గొల్ల నాగరాజు కుమారుడు కురుమూర్తి (15) చంద్రప్ప తాండ శివారులోని ఓ వ్యవసాయ పొలంలో ఉన్న బావిలో ఈతకు వెళ్లాడు. ఈత కొడుతుండగా బాలుడు అస్వస్థతకు గురై కొట్టుమిట్టాడుతూ నీటిలో మునిగి మృతి చెందాడు. పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.
Similar News
News October 19, 2025
వాళ్లిద్దరికీ ప్రజలే శిక్ష విధిస్తారు: మావోయిస్టులు

మావోయిస్టు అగ్రనేతలు ఇటీవల లొంగిపోవడంతో మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించింది. అభయ్ పేరుతో 4 పేజీల లేఖను విడుదల చేసింది. ‘మల్లోజుల, ఆశన్నలు విప్లవ ద్రోహులుగా మారారు. వాళ్లిద్దరికీ ప్రజలే శిక్ష విధిస్తారు. ఆయుధాలను విడిచిపెట్టడంపై మల్లోజుల వితండవాదాన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పుడు ప్రాణభీతితో కొందరు లొంగిపోతుండవచ్చు. ఇది తాత్కాలిక నష్టం మాత్రమే’ అని లేఖలో పేర్కొంది.
News October 19, 2025
అనకాపల్లిలో రేపు PGRS కార్యక్రమం రద్దు

దీపావళి పండగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈనెల 20న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్‌తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రద్దు చేసినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు.
News October 19, 2025
అభ్యర్థులే CHSLE సెంటర్ ఎంచుకునే అవకాశం

కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామ్(CHSLE -2025) టైర్ 1 పరీక్ష నవంబర్ 12న ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అనుకూలమైన సిటీ, షిఫ్ట్‌ను ఎంచుకునే సౌకర్యంను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) కల్పించింది. అభ్యర్థులు SSC పోర్టల్‌లో లాగిన్ అయి నగరం (దరఖాస్తు సమయంలో ఎంచుకున్న మూడు నగరాల్లో ఒకటి), తేదీ, షిఫ్ట్‌ను ఎంచుకోవచ్చు. పోర్టల్ విండో అక్టోబర్ 22 నుంచి 28 వరకు ఓపెన్ అవుతుంది.