News March 11, 2025
NRPT: ‘భూముల సమస్యలు కోర్టులో పరిష్కరించుకోవాలి’

భూములకు సంబంధించిన సివిల్ కేసులు కోర్టు పరిధిలో పరిష్కరించుకోవాలని ఎస్పీ యోగేశ్ గౌతమ్ అన్నారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి చట్టం ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. మొత్తం 09 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ చెప్పారు.
Similar News
News December 7, 2025
TCILలో 150 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

టెలి కమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (<
News December 7, 2025
తెలుగువారి పరువు పోయింది.. రామ్మోహన్ రాజీనామా చేయాలి: అమర్నాథ్

AP: ఇండిగో సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మంత్రి రామ్మోహన్ పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ‘చరిత్రలో ఈ తరహా ఇబ్బంది ఎదుర్కోవడం ఇదే తొలిసారి. దేశంలో తెలుగు వారి పరువు, ప్రపంచంలో ఇండియా పరువు పోయింది. అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ సమయంలో ఆయన రీల్స్ చేసుకున్నారనే అపవాదులు వచ్చాయి. రామ్మోహన్ రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు.
News December 7, 2025
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 15 నుంచి గుడివాడకు వందే భారత్

చెన్నై-విజయవాడ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సేవను గుడివాడ జంక్షన్, భీమవరం టౌన్ మీదుగా నరసాపురం వరకు ఈ నెల 15వ తేదీ నుంచి పొడిగిస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విస్తరణతో ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. అయితే నర్సాపురం, మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్కు వందే భారత్ రైలు నడపాలని ప్రయాణికుల కోరుతున్నారు.


