News January 29, 2025

NRPT: ‘భూసేకరణ పనులలో వేగం పెంచాలి’

image

భూసేకరణ, నీటి పారుదల శాఖ అధికారులు సమన్వయంతో జిల్లాలో భూసేకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్లో కోయిల్ సాగర్, కొడంగల్ నారాయణపేట, భీమా ప్రాజెక్టు భూసేకరణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కృష్ణ మండలంలో భీమ ప్రాజెక్టు కింద 45.34 ఎకరాల భూములను స్వాధీనం చేసుకోవాలని అన్నారు. సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Similar News

News January 10, 2026

పసుపు ఉడకబెట్టే ప్రక్రియలో కీలక సూచనలు

image

పసుపు దుంపలను తవ్విన 2 నుంచి 3 రోజుల్లోపలే దుంపలను ఉడికించాలి. దీనివల్ల మంచి నాణ్యత ఉంటుంది. ఆలస్యమైతే నాణ్యత తగ్గుతుంది. పసుపు దుంపలు, కొమ్ములను వేరుగావేరుగా ఉడకబెట్టాలి. మరీ ఎక్కువ ఉడకబెడితే రంగు చెడిపోతుంది. తక్కువగా ఉడకబెడితే దుంపలు పెళుసుగా మారి మెరుగు పెట్టేటప్పుడు ముక్కలుగా విరిగిపోతాయి. స్టీమ్ బాయిలర్లలో తక్కువ సమయంలో ఎక్కువ పసుపును ఉడికించి, నాణ్యతతో కూడిన పసుపు పొందవచ్చు.

News January 10, 2026

వీసా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను పెంచిన US

image

వీసా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును పెంచుతున్నట్లు US ప్రకటించింది. పెంచిన ధరలు మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. H-1B, L-1, O-1, P-1, TN వంటి ఫామ్ I-129 వీసాలకు $2,805 (₹2.53L) నుంచి $2,965 (₹2.67L)కి పెంచింది. ఫామ్ I-140 ఇమ్మిగ్రంట్ పిటిషన్లకూ $2,965గా నిర్ణయించింది. ఫామ్ I-765, I-129 అప్లికేషన్స్‌కు $1,685 నుంచి $1,780కి పెంచింది. ఫామ్ I-539 అప్లికేషన్లకు $1,965 నుంచి $2,075గా నిర్ణయించింది.

News January 10, 2026

ఫ్లెమింగో ఫెస్టివల్.. ఆటకానితిప్పలో పక్షుల విన్యాసాలు!

image

సూళ్లూరుపేట- శ్రీహరికోట దారిలోని ఆటకానితిప్ప వద్ద పులికాట్ సరస్సులో వలస పక్షుల వేట విన్యాసాలు పక్షి ప్రేమకులను కట్టిపడేస్తాయి. సూళ్లూరుపేట నుంచి సూమారు 10 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇక్కడ వన్యప్రాణి విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పక్షుల విజ్ఞాన కేంద్రం ఆకట్టుకుంటుంది.