News March 6, 2025

NRPT: ‘మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి’

image

నారాయణపేటలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో బుధవారం జిల్లా దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించినట్లు నషా ముక్త్ భారత్ వాలంటీర్లు లక్ష్మీకాంత్, సంధ్య తెలిపారు. గంజాయి, డ్రగ్స్, కొకైన్ తదితర మత్తు పదార్థాలు వాడడం ద్వారా కలిగే నష్టాలు, అనర్థాలను విద్యార్థులకు వివరించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోకూడదని సూచించారు.

Similar News

News November 27, 2025

సారంగాపూర్: ‘ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించాలి’

image

సారంగాపూర్ మండలం కోనాపూర్, అర్పపల్లి, ధర్మానాయక్ తండా, రంగపేట, నాగునూర్, లచ్చక్కపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ బీ.ఎస్.లత ఆకస్మికంగా పరిశీలించారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు వేగంగా చేయాలని ఆదేశించారు. 17% తేమ ఉన్నా సన్న, దొడ్డు రకాలు తప్పనిసరిగా కొనాలన్నారు.

News November 27, 2025

పాక్ న్యూక్లియర్ కంట్రోల్స్ ఆసిమ్ మునీర్ చేతికి!

image

పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఆ దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌(CDF)గా బాధ్యతలు చేపట్టారు. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌కు అతను అధిపతిగా ఉంటారు. ఆ దేశ ప్రధానికి సరిసమానమైన పవర్స్ మాత్రమే కాదు లీగల్ ప్రొటెక్షన్ కూడా ఆసిమ్ మునీర్‌కు ఉంటుందని చెబుతున్నారు. అతనికి కేసుల నుంచి లైఫ్ టైమ్ ఇమ్యూనిటీతో పాటు న్యూక్లియర్ వెపన్స్ కంట్రోల్స్ కూడా అతని చేతికే ఇస్తారని తెలుస్తోంది.

News November 27, 2025

సారంగాపూర్: ‘వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి’

image

సారంగాపూర్ మండలం అర్పపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ను అదనపు కలెక్టర్ బీ.ఎస్.లత గురువారం పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి భోజనం నాణ్యత, మెనూ, రిజిస్టర్లను తనిఖీ చేశారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. గైర్హాజరైన విద్యార్థిని అక్షిత ఇంటికి వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు.