News February 12, 2025
NRPT: మన్యంకొండ జాతరకు ప్రత్యేక బస్ సర్వీసులు

మన్యంకొండ జాతర సందర్భంగా నారాయణపేట బస్ డిపో నుండి ప్రత్యేక బస్ సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ లావణ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రేపు ఎల్లుండి (బుధవారం, గురువారం) రెండు రోజుల పాటు భక్తుల సౌకర్యం కొరకు బస్ సర్వీసులు నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక బస్ సర్వీసులను పట్టణం తోపాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
Similar News
News December 10, 2025
చీకటి గదిలో ఫోన్ చూస్తున్నారా?

చాలామందికి నిద్రపోయే ముందు ఫోన్ చూడటం అలవాటు. అలా చూడటం కళ్లకు మంచిది కాదని తెలిసినా ‘తప్పదు’ అని లైట్ తీసుకుంటారు. అయితే ఆ ‘లైట్’ ముఖ్యం అంటున్నారు వైద్యులు. గదిలోని అన్ని లైట్లు ఆర్పేసి చీకట్లో ఫోన్ చూడటం వల్ల దాని కాంతి నేరుగా కళ్లపై పడి అవి దెబ్బతినే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. రాత్రివేళ ఫోన్ చూసినప్పుడు తప్పనిసరిగా గదిలో వెలుతురు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.
News December 10, 2025
వైద్య సహాయానికి రికార్డ్ స్థాయిలో CMRF నిధులు

TG: పేద, మధ్య తరగతి ప్రజల వైద్యానికి అందించే CMRF సహాయంలో రికార్డ్ నెలకొల్పినట్లు ప్రభుత్వం తెలిపింది. 2014-24 మధ్య కాలంలో ఏటా రూ.450Cr నిధులు కేటాయించగా గత రెండేళ్లలో ఏటా రూ.850Cr సహాయం అందించినట్లు ప్రకటించింది. ఈ రెండేళ్లలో 3,76,373 మంది లబ్ధిదారులకు రూ.1,685.79Cr పంపిణీ చేసినట్లు పేర్కొంది. LOCల ద్వారా రూ.533.69Cr, రీయింబర్స్‌మెంట్ ద్వారా రూ.1,152.10Cr పంపిణీ చేసినట్లు తెలిపింది.
News December 10, 2025
గొలుగొండ: బాలిక గర్భం దాల్చిన ఘటనపై పోక్సో కేసు నమోదు

గొలుగొండ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బాలిక గర్భం దాల్చిన ఘటనపై విచారణ చేపట్టారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు రూరల్ సీఐ రేవతమ్మ పర్యవేక్షణలో బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.రామారావు తెలిపారు. బాలిక తల్లి ఇచ్చిన పిర్యాదుతో దర్యాప్తు కొనసాగుతోంది అని చెప్పారు.


