News February 12, 2025
NRPT: మన్యంకొండ జాతరకు ప్రత్యేక బస్ సర్వీసులు

మన్యంకొండ జాతర సందర్భంగా నారాయణపేట బస్ డిపో నుండి ప్రత్యేక బస్ సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ లావణ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రేపు ఎల్లుండి (బుధవారం, గురువారం) రెండు రోజుల పాటు భక్తుల సౌకర్యం కొరకు బస్ సర్వీసులు నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక బస్ సర్వీసులను పట్టణం తోపాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
Similar News
News March 20, 2025
తాగునీటి సరఫరాకు ప్రణాళికను అమలు చేయాలి: కలెక్టర్

క్షేత్రస్థాయిలో తాగునీటి సరఫరాకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, తదితర అధికారులతో ఇందిరమ్మ ఇళ్లు, మిషన్ భగీరథ, తాగు నీరు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. వడదెబ్బ తగలకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలనే అంశంపై విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
News March 20, 2025
ALERT: ఆ జిల్లాల్లో ఉరుములు.. వడగండ్ల వానలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, కొమురంభీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో <
News March 20, 2025
జనగామ కలెక్టరేట్లో ఇఫ్తార్ విందు

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని జనగామ కలెక్టరేట్లోని టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో గురువారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ హాజరై మాట్లాడుతూ.. ముస్లిం ఆచార సాంప్రదాయం ఆచరిస్తూ.. సమాజం కోసం పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.