News February 4, 2025
NRPT: మరో రెండు రోజులే మిగిలింది..!

తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఫిబ్రవరి 1న చివరి తేది ఉండగా.. ప్రభుత్వం దరఖాస్తు చివరి తేదీని ఫిబ్రవరి 6 వరకు పొడిగించింది. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేయనట్లయితే చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత శాఖ నాగర్‌కర్నూల్ జిల్లా అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News February 13, 2025
అమెరికా నుంచి మరో వలసదారుల విమానం?

అమెరికాకు అక్రమంగా వలసవెళ్లిన వారితో కూడిన రెండో విమానం ఈ నెల 15న పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 5న 104మంది వలసదారుల్ని US అమృత్‌సర్‌కు పంపించిన సంగతి తెలిసిందే. మొత్తంగా 487మంది అక్రమ వలసదారుల్ని అమెరికా పంపించనున్నట్లు సమాచారం. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కావాలనే పంజాబ్‌ను లక్ష్యంగా చేసుకుని విమానాల్ని తమ వద్ద దించుతోందని ఆ రాష్ట్ర మంత్రి హర్పాల్ చీమా ఆరోపించారు.
News February 13, 2025
క్రమబద్ధీకరణ పథకం కింద తొలి దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్

ప్రభుత్వ నిబంధనల మేరకు క్రమబద్ధీకరణ పథకం కింద ఇంటి పట్టా మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం రూరల్ పరిధిలోని కక్కలపల్లి గ్రామంలో క్రమబద్ధీకరణ పథకం-2025 కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇంటికి నేరుగా వెళ్లి కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఇంటి పట్టా మంజూరు చేయాలని అధికారులకు ఆదేశించారు.
News February 13, 2025
పెద్దేముల్: సెలవు ఇవ్వాలని డిమాండ్

ఫిబ్రవరి 15న శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి రోజు సెలవు ప్రకటించాలని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేనావత్ రవికుమార్, మండల అధ్యక్షుడు శంకర్ నాయక్ అన్నారు. గురువారం పెద్దేముల్ తహశీల్దార్ వెంకటేశ్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. దేశంలో 15 కోట్ల మంది, రాష్ట్రంలో 40 లక్షలమంది లంబాడీలు ఉన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బుజ్జమ్మ, గోవింద్ నాయక్, సవిత తదితరులు పాల్గొన్నారు.