News March 26, 2025

NRPT: ‘మహిళలు వ్యాపార రంగంలో రాణించాలి’

image

మహిళలు వినూత్న ఆలోచనలతో వ్యాపారంలో రాణించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం నారాయణపేట నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌కు మంచి ఆదరణ లభించిందని, జిల్లాకు మంచి పేరు తెచ్చిందని అన్నారు.

Similar News

News January 8, 2026

Official: ‘జన నాయగన్‌’ విడుదల వాయిదా

image

విజయ్ హీరోగా తెరకెక్కిన ‘జన నాయగన్’ సినిమా రిలీజ్ వాయిదా పడింది. అనివార్య కారణాలతో విడుదలను నిలిపివేస్తున్నట్లు KVN ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం అవుతూ వచ్చింది. కొన్ని సన్నివేశాలు తొలగించాలని సూచించిన సెన్సార్ బోర్డు, మార్పుల తర్వాత స్పందించలేదు. దీంతో నిర్మాణ సంస్థ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది.

News January 8, 2026

కరీంనగర్: మితిమీరిన వేగం ప్రాణాంతకం: డీటీసీ

image

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా నుస్తులాపూర్ వద్ద రవాణా, ట్రాఫిక్ పోలీసులు ఉమ్మడిగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనాలు మితిమీరిన వేగంతో నడపడం ప్రాణాంతకమని డీటీసీ పురుషోత్తం పేర్కొన్నారు. ఎస్‌హెచ్-1 రహదారిపై తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన 10 వాహనాలకు జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ వేగ నియంత్రణ పాటించాలని సూచించారు.

News January 8, 2026

కొత్తపల్లి: అక్రమ ఇసుక రవాణాపై వేటు: కలెక్టర్

image

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. బుధవారం సీపీ గౌస్ ఆలం తో కలిసి తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి ఇసుక క్వారీని ఆమె తనిఖీ చేశారు. ఎల్‌ఎండీ రిజర్వాయర్ పూడికతీత, ఇసుక వేరు చేసే ప్రక్రియను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. పరిమితికి మించి లోడింగ్ చేసిన, అనధికార వాహనాలు వినియోగించినా ఉపేక్షించబోమన్నారు.