News March 16, 2025

NRPT: ‘మహిళల రక్షణే షీ టీమ్ లక్ష్యం’

image

మహిళలకు రక్షణ కల్పించడమే ప్రధాన ధ్యేయంగా షీ టీమ్ ఏర్పాటు చేశామని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. జిల్లాలో ఎక్కడైనా ఆకతాయిలు నుంచి మహిళలకు వేధింపులకు గురైతే నిర్భయంగా షీ టీమ్ పోలీసులకు నేరుగా లేదా 8712670398 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. గృహహింస, మానసికంగా వేధింపుల, అదనపు కట్నం వేధింపులపై ఫిర్యాదు చేయవచ్చని అన్నారు.

Similar News

News December 10, 2025

సూర్యాపేట: బీఆర్‌ఎస్‌ కార్యకర్త దారుణ హత్య

image

సర్పంచ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా నూతనకల్ (M) లింగంపల్లిలో మంగళవారం రాత్రి ఘర్షణ రక్తసిక్తమైంది. కాంగ్రెస్, BRS వర్గీయుల మధ్య చెలరేగిన ఘర్షణలో కర్రలు, రాళ్లతో సుమారు 70 మంది దాడి చేసుకున్నారు. తీవ్రంగా గాయపడిన BRS కార్యకర్త ఉప్పుల మల్లయ్యను చికిత్స కోసం HYD తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో చనిపోయినట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. గ్రామంలో పోలీసులు మోహరించారు.

News December 10, 2025

NTR: భర్త మరణాన్ని తట్టుకోలేక.. భార్య మృతి..!

image

వాంబేకాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క్యాటరింగ్ పనులు చేసే అజయ్ కుమార్ మంగళవారం ఛాతినొప్పితో 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యమార్గంలోనే మృతి చెందాడు. దీంతో ఆయన భార్య నాగలక్ష్మి తీవ్రంగా రోధించింది. అజయ్ కుమార్ అంత్యక్రియలు ముగించుకుని కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చేసరికి, నాగలక్ష్మి సైతం కన్నుమూసింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది.

News December 10, 2025

నేడు జగ్గన్నతోట ప్రబల తీర్థంపై సమావేశం

image

అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో 11 గ్రామాలకు చెందిన ఏకాదశ రుద్రులు కొలువు తీరే ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగగా గుర్తింపు లభించనుంది. నాలుగున్నర శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ తీర్థం నిర్వహణ సమీపిస్తుండటంతో ఆర్డీఓ శ్రీకర్ సారధ్యంలో అధికారులు బుధవారం మొసలపల్లిలో ఉత్సవ కమిటీతో సమావేశం ఏర్పాటు చేశారు. లక్షలాది మంది తరలి వచ్చే తీర్థం ఏర్పాట్లపై సమావేశంలో సమీక్షించనున్నారు.