News March 28, 2025
NRPT: మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రాయితీ నిధులు

మహిళా స్వయం సహాయక బృందాలు బ్యాంకుల నుంచి పొందిన రుణాలకు సంబంధించి వాయిదాల ప్రకారం సక్రమంగా చెల్లించిన స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు రాయితీని ప్రభుత్వం మంజూరు చేసింది. ఏప్రిల్ 2024 నుంచి జనవరి 2025 వరకు నిధులు విడుదల చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని 6,028 మహిళా సంఘాలకు రూ.11.76 కోట్ల నిధులు విడుదల చేసింది. వడ్డీ రాయితీ నిధులు మంజూరు రావడంపై హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News November 23, 2025
నిర్మల్: పర్యటన రూట్ కాదు.. రిస్క్ రూట్

గడిచిన పది నెలల్లో జిల్లాలో 522 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు పోలీసు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 139 మంది ప్రాణాలు కోల్పోగా.. 612 మంది క్షతగాత్రులు గాయపడ్డారు. ప్రధానంగా నిర్మల్-భైంసా, బాసర-భైంసా, నిర్మల్-ఖానాపూర్ మార్గాల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాహనాలను నెమ్మదిగా, జాగ్రత్తగా నడపాలని ఎస్పీ జానకి షర్మిలా సూచించారు.
News November 23, 2025
వరంగల్: మూఢం ప్రారంభం.. శుభకార్యాలకు బ్రేక్!

ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే శుక్ర మౌఢ్యం ఫిబ్రవరి 17, 2026 వరకు కొనసాగనుంది. దాదాపు మూడు నెలలు శుభముహూర్తాలు లేకపోవడంతో వరంగల్ ఉమ్మడి జిల్లాలో వివాహాలు, గృహ ప్రవేశాలు, ప్రతిష్ఠాపనలు నిలిచిపోనున్నాయి. రథ సప్తమి, వసంత పంచమి, మాఘపౌర్ణమి కూడా మౌఢ్యంలో పడటం వల్ల కార్యాలు జరగవు. దీంతో ఫంక్షన్ హాళ్లు, జ్యువెలరీ, బట్టల షాపులు, క్యాటరింగ్, ఫొటోగ్రఫీ రంగాల్లో భారీ నష్టం తప్పదని పురోహితులు చెబుతున్నారు.
News November 23, 2025
ఆయిల్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు

అసోంలోని దులియాజన్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ 3 ఇంజినీర్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 27న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 24 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.70వేలు చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.oil-india.com/


