News April 9, 2025
NRPT: ‘మాదకద్రవ్యాల నిషేధాన్ని పగడ్బందీగా అమలు చేయాలి’

జిల్లాలో మాదకద్రవ్యాల నిషేధాన్ని పగడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం నారాయణపేట కలెక్టరేట్లో మాదకద్రవ్యాల నిషేధం (యాంటీ నార్కోటిక్)పై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని అన్ని కళాశాలల్లో యాంటి డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేసి డ్రగ్స్‌పై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. డీఎస్పీ లింగయ్య, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News October 29, 2025
సంగారెడ్డి: బిడ్డపై తండ్రి ప్రేమ అంటే ఇదే..!

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం AEO శ్వేత రెండు కిడ్నీలు ఫెయిలై HYD కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఆమె తండ్రి బిరాదర్ శ్యామ్‌రావు తన ఒక కిడ్నీని కూతురికి దానమిచ్చి ప్రాణం పోశారు. వీరి ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న శ్వేతకు ICU నుంచి జనరల్ వార్డులోకి షిఫ్ట్ చేశారని ఆమె తల్లి ఉమారాణి తెలిపారు. ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సభ్యుడు నాగేశ్ వారికి ధైర్యాన్నిచ్చారు.
News October 29, 2025
KNR: ‘గ్రూప్ పాలిటిక్స్‌కు చెక్’ పెట్టేది ఆయనేనా..?

KNR CONGలో గ్రూపు పాలిటిక్స్‌కు చెక్ పెట్టాలంటే MLA మేడిపల్లి సత్యం నాయకత్వం అనివార్యమని అధిష్ఠానం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. DCC అధ్యక్షుడి ఎంపికలో భాగంగా జిల్లాకు వచ్చిన AICC పరిశీలకులకు మెజారిటీ కార్యకర్తలు మేడిపల్లి సత్యం పేరును సూచించినట్లు తెలుస్తోంది. అవసరం ఉన్నచోట MLAలను DCC అధ్యక్షులుగా ఎంపిక చేస్తామని PCC చీఫ్ స్పష్టం చేశారు. దీంతో సత్యంకు DCC ప్రెసిడెంట్‌గా అవకాశాలు మెరుగయ్యాయి.
News October 29, 2025
సంగారెడ్డి జిల్లాకు 35 చెరుకు కోత యంత్రాలు..!

జిల్లాలో చెరుకు కోతకు కూలీల కొరత తీరనున్నది. ఈ మేరకు జిల్లాలో 35 చెరుకు కోత యంత్రాలు రంగంలోకి దిగనున్నాయి. ఒక్కో యంత్రం రోజుకు 70 నుంచి 100 టన్నుల చెరుకు కోసే సామర్థ్యం ఉంది. ఈ మేరకు బ్యాంకర్లు 5 యంత్రాలు లబ్ధిదారులకు అందజేయనున్నారు. జిల్లాలో మూడు చెరుకు ఫ్యాక్టరీల పరిధిలో 21 లక్షల టన్నుల చెరుకు పంట ఉత్పత్తి కానుందని అంచనా. చెరుకు తరలించేందుకు ప్రస్తుతం 18 కోత యంత్రాలు సిద్ధం చేస్తున్నారు.


