News April 9, 2025

NRPT: ‘మాదకద్రవ్యాల నిషేధాన్ని పగడ్బందీగా అమలు చేయాలి’

image

జిల్లాలో మాదకద్రవ్యాల నిషేధాన్ని పగడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం నారాయణపేట కలెక్టరేట్లో మాదకద్రవ్యాల నిషేధం (యాంటీ నార్కోటిక్)పై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని అన్ని కళాశాలల్లో యాంటి డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేసి డ్రగ్స్‌పై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. డీఎస్పీ లింగయ్య, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News July 8, 2025

ప్రెస్ క్లబ్‌కు ఎవరొచ్చినా చర్చకు సిద్ధం: కేటీఆర్

image

TG: తమ నేతలు మాట్లాడే సమయంలో అసెంబ్లీ‌లో మైక్ కట్ చేయకుండా చర్చకు అనుమతిస్తే సమావేశాలకు వస్తామని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ అన్నారు. ‘రైతు శ్రేయస్సుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు రమ్మని చెబితే సీఎం ఢిల్లీ వెళ్లారు. ఆయన బదులు మంత్రులు ఎవరైనా వస్తారని భావిస్తున్నా. ఎవరొచ్చినా చర్చకు సిద్ధం. అక్కడే ఎదురుచూస్తాం. సీఎం ఇంకో రోజు టైమ్ ఇచ్చినా చర్చకు వస్తాం’ అని తెలిపారు.

News July 8, 2025

NLG: స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్

image

స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఉమ్మడి జిల్లాలో లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో సత్తా చాటాలని ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఉమ్మడి జిల్లాకు AICC కార్యదర్శి సంపత్ కుమార్‌ను ఇన్‌ఛార్జిగా నియమించారు. త్వరలో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీల నిర్మాణం చేపట్టాలని అధిష్ఠానం ఆదేశించింది.

News July 8, 2025

చెల్లెలు లాంటి నాపై ప్రసన్న నీచపు వ్యాఖ్యలు: ప్రశాంతి

image

AP: వరుసకు చెల్లెలు అయ్యే తనపై YCP నేత నల్లపురెడ్డి <<16985283>>ప్రసన్న<<>> కుమార్ రెడ్డి నీచపు వ్యాఖ్యలు చేస్తున్నారని TDP MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మండిపడ్డారు. తనపై దారుణ వ్యాఖ్యలు చేస్తున్న ప్రసన్నను కోర్టుకు ఈడుస్తానని ఆమె హెచ్చరించారు. ‘ప్రతీసారి VPRకు డబ్బు ఉందని మాజీ మంత్రి అనిల్ అంటున్నారు. ఆయనకు లేవా డబ్బులు? ఏమైనా అడుక్కు తింటున్నారా? అనిల్‌కు కూడా జైలు శిక్ష తప్పదు’ అని ఆమె ఫైర్ అయ్యారు.