News January 28, 2025

NRPT: మార్కెట్ యార్డులో ధరలు 

image

నారాయణపేట మార్కెట్ యార్డులో మంగళవారం వేరుశనగ క్వింటాలుకు గరిష్టంగా రూ. 5,719, కనిష్టంగా రూ. 3,006 పలికిందని మార్కెట్ సెక్రటరీ భారతి తెలిపారు. ఎర్ర కందులు క్వింటాలుకు గరిష్టంగా రూ. 7,450, కనిష్టంగా రూ. 3,551, ఎర్ర కందులు క్వింటాలుకు గరిష్టంగా రూ. 8,012, కనిష్టంగా రూ. 6,510 ధర పలికిందని ఆమె తెలిపారు. మార్కెట్ కు వరి ధాన్యం రాలేదని చెప్పారు.

Similar News

News November 9, 2025

పెరుగుతున్న చలి.. వచ్చేవారం మరో అల్పపీడనం

image

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ఏపీలోని అల్లూరి జిల్లా జి.మాడుగులలో నిన్న 14.5 డిగ్రీలు, చాలా జిల్లాల్లో 20-25 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు తెలంగాణలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. మరోవైపు వచ్చేవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయన్నారు.

News November 9, 2025

ఆముదపు విత్తులు ముత్యాలవుతాయా?

image

ఒక వస్తువు లేదా వ్యక్తి సహజ స్వభావం ఎప్పటికీ మారదు. ఆముదపు విత్తనాలు ఎప్పటికీ ఆముదపు విత్తనాలుగానే ఉంటాయి, అవి విలువైన ముత్యాలుగా మారవు. అలాగే దుర్మార్గులైన లేదా చెడ్డ స్వభావం కలిగిన వ్యక్తులు వారి ప్రవర్తనను మార్చుకోరని చెప్పడానికి.. సహజంగా జరగని లేదా అసాధ్యమైన విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.

News November 9, 2025

కార్తీకంలో ఏ దానం చేస్తే ఏ ఫలితం?

image

దీప దానం చేస్తే అజ్ఞానం తొలగిపోతుంది.
అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది.
వస్త్ర దానం వల్ల శివానుగ్రహం కలుగుతుంది.
స్వయంపాకం దానమిస్తే గౌరవం పెరుగుతుంది.
ఉసిరికాయలు దానం చేస్తే శుభం కలుగుతుంది.
గోదానంతో కృష్ణుడి కృప మీపై ఉంటుంది.
తులసి దానం చేస్తే మోక్షం లభిస్తుంది.
ధన దానం చేస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది.
పండ్లను దానం చేస్తే సంతానం కలుగుతుంది.