News March 28, 2025

NRPT: మార్కెట్ యార్డ్‌కు వరుసగా నాలుగు రోజుల సెలవు

image

నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డుకు నాలుగు రోజులు సెలవు ప్రకటించినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు శుక్రవారం ఒక ప్రకటన తెలిపారు. ఈనెల 29న అమావాస్య, 30 ఆదివారం సాధారణ సెలవు రోజులు కాగా 31, ఏప్రిల్ 1న రంజాన్ సెలవు కావడంతో వరుసగా నాలుగు రోజులపాటు మార్కెట్ యార్డులో ఎలాంటి క్రయవిక్రయాలు జరుపబడవని ప్రకటించారు. యథావిధిగా ఏప్రిల్ 2న బుధవారం మార్కెట్ యార్డులో లావాదేవీలు కొనసాగుతాయన్నారు.

Similar News

News September 18, 2025

‘తెలంగాణ చరిత్ర తెలియాలంటే సూర్యాపేటకు రండి’

image

తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్నారని బృందాకారత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటలో సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన సాయుధ పోరాట వారోత్సవాల సెమినార్‌లో ఆమె మాట్లాడారు. సాయుధ పోరాటాన్ని హిందూ, ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చూపిస్తున్నారన్నారు. రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షాలకు తెలంగాణ చరిత్ర తెలియాలంటే సూర్యాపేటకు వచ్చి చూడాలని ఆమె సవాల్ విసిరారు. చరిత్రను వక్రీకరించడం మానుకోవాలని హెచ్చరించారు.

News September 18, 2025

అంధుల పాఠశాల నిర్మాణానికి పక్కా ప్రణాళిక

image

ఖమ్మం జిల్లాలో అంధుల కోసం పాఠశాల నిర్మాణానికి పక్కా ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అంధుల స్కూల్‌ ఏర్పాటుపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ డా.పి.శ్రీజ, జడ్పీ సీఈఓ, విద్యాశాఖ అధికారులతో చర్చించారు. త్వరలోనే పాఠశాల నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు.

News September 18, 2025

ఆసిఫాబాద్‌లో మహిళ అదృశ్యం.. కేసు నమోదు

image

ఆసిఫాబాద్ మండలం అంకుశాపూర్‌కు చెందిన జంగంపల్లి పద్మ(32) అనే మహిళ అదృశ్యమైనట్లు ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్ ఈరోజు తెలిపారు. ఈనెల 15న తన పుట్టింటికి వెళతానని భర్త రాజేశ్వర్‌కు చెప్పి వెళ్లిందని, కానీ ఆమె పుట్టింటికి కూడా వెళ్లలేదన్నారు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు బుధవారం ఆసిఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.