News March 7, 2025
NRPT: మూడు రోజుల పాటు తాగునీటి సరఫరాలో అంతరాయం

నారాయణపేట పట్టణ ప్రజలకు మూడు రోజుల పాటు తాగునీటి సరఫరా నిలిపివేసినట్లు మున్సిపల్ కమిషనర్ బొగేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని సింగారం కూడలిలో తాగునీటి పైప్ లైన్ లీకేజీ మరమ్మతుల కారణంగా రేపు శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజులు సరఫరా ఉండదని చెప్పారు. మరమ్మతులు శరవేగంగా కొనసాగుతున్నాయని, పట్టణ ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా కమిషనర్ కోరారు.
Similar News
News March 16, 2025
పెద్దపల్లి: ‘వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి’

సింగరేణి వ్యాప్తంగా మాజ్దూర్ కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న 103 మందికి గతేడాది 2024- April, mayనెలలకు సంబంధించిన వేతనాలు చెల్లించకపోవడంపై పెద్దపల్లి జిల్లా BJP అధ్యక్షులు కర్రే సంజీవ రెడ్డి, రామగుండం నాయకురాలు కందుల సంధ్యారాణి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. KCP కంపెనీ కార్మికులకు ఏడాదిగా వేతనాలు చెల్లించకపోవడం పట్ల తీవ్ర ఆవేదన చెందుతున్నారన్నారు.
News March 16, 2025
STN: జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం

స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఏర్పాటు చేసిన సభ వేదిక వద్దకు సీఎం రేవంత్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వేదిక వద్ద ఏర్పాటు చేసిన జ్యోతిప్రజ్వల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
News March 16, 2025
సంక్షేమ పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

స్టేషన్ ఘనపూర్‌లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి రూ.800 కోట్ల విలువ గల పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను డిజిటల్ విధానంలో ప్రారంభించారు. వారు ప్రారంభించిన వాటిలో 100 పడకల ఆసుపత్రి, స్కూల్స్, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో పాటు పలు కాలువలు, బంజారా భవన్, మహిళ శక్తి బస్సులు లాంటి సంక్షేమ పతకాలున్నాయి. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, పలువురు ఎమ్మెల్యేలు తదితరులున్నారు.