News January 31, 2025

NRPT: మెడికల్ కలశాలను సందర్శించిన కలెక్టర్

image

నారాయణపేట మండలం అప్పక్ పల్లి వద్ద ఉన్న మెడికల్ కలశాలను గురువారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించారు. కాలేజీలోని వివిధ విభాగాలను, కళాశాల ఆవరణను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే ప్రిన్సిపల్ దృష్టికి తేవాలని సూచించారు. కాలేజీకి మంచి పేరు వచ్చేలా ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రామ్ కిషన్, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News December 23, 2025

‘లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు’

image

కామారెడ్డిలోని DM&HO కార్యాలయంలో మంగళవారం జిల్లా స్థాయి అడ్వైజరీ పీసీపీఎన్‌డీటీ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి విద్య మాట్లాడుతూ.. జిల్లాలోని స్కానింగ్ సెంటర్లను పీఓలు, డిప్యూటీ డిఎం&హెచ్‌ఓలు నిరంతరం తనిఖీ చేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పీఓ డాక్టర్ హేమీమా, గైనకాలజిస్ట్ దివ్య తదితరులు ఉన్నారు.

News December 23, 2025

నూతన పింఛన్లకు మార్గదర్శకాలు రాలేదు: జిల్లా కలెక్టర్

image

ఎన్టీఆర్ భరోసా పథకం కింద నూతన పింఛన్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా మార్గదర్శకాలు రావాల్సి ఉందని జిల్లా కలెక్టర్ ఆనంద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కేవలం స్పౌజ్ కేటగిరీ కింద భర్త మరణించిన వితంతువులకు మాత్రమే పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర కేటగిరీల దరఖాస్తుదారులు మార్గదర్శకాలు వచ్చే వరకు వేచి ఉండాలని కలెక్టర్ జిల్లా ప్రజలకు సూచించారు.

News December 23, 2025

కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా గోపికృష్ణ, రాజ్ కుమార్

image

రాజన్నసిరిసిల్ల జిల్లా కోర్టుల్లో కేంద్రప్రభుత్వ వివిధ శాఖల తరఫున కేసులు వాదించేందుకు అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులను నియమిస్తూ భారత న్యాయమంత్రిత్వ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. వేములవాడకు చెందిన సీనియర్ న్యాయవాదులు కేశన్నగారి గోపికృష్ణ, రేగుల రాజ్ కుమార్‌లకు ఈ బాధ్యతలు దక్కాయి. ఇకపై జిల్లాలోని వివిధ న్యాయస్థానాల్లో కేంద్రప్రభుత్వానికి సంబంధించిన కేసులను వీరిద్దరూ పర్యవేక్షించనున్నారు.