News February 13, 2025
NRPT: మైనర్లను అదుపులోకి తీసుకున్న అధికారులు

నారాయణపేట ఆర్టీసీ బస్టాండ్, మినీ స్టేడియం మైదానంలో మైనర్ పిల్లలు యాచిస్తున్నారని అందిన సమాచారం మేరకు చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులు చిన్నారులను అదుపులోకి తీసుకున్నారని జిల్లా సమన్వయకర్త నర్సింలు తెలిపారు. ఆరుగురు పిల్లలను చిల్డ్రన్స్ హోమ్‌కు తరలించామని చెప్పారు. పిల్లల పేరెంట్స్‌కు కౌన్సెలింగ్ నిర్వహించి అప్పగిస్తామని చెప్పారు. బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం చట్టరీత్య నేరమన్నారు.
Similar News
News November 27, 2025
సాధారణ ప్రసవాలు చేయాలి: మంచిర్యాల DMHO

జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల గైనకాలజిస్టులందరూ సాధారణ ప్రసవాలకు ముందుండాలని, సిజేరియన్లకు దూరంగా ఉండాలని DMHO డా.అనిత ఆదేశించారు. జిల్లా కార్యాలయంలో ప్రైవేట్ ఆసుపత్రుల గైనకాలజిస్టులతో ఆసుపత్రులలో ప్రసవాలు, లింగ నిర్ధారణపై గురువారం సమీక్ష నిర్వహించారు. మొదటి ప్రసవానికి వచ్చే వారికి సాధారణ ప్రసవం చేయాలన్నారు. ధరల పట్టికలు, అందిస్తున్న వైద్య సేవల వివరాలను గోడపై అతికించాలని సూచించారు.
News November 27, 2025
VZM: డిసెంబర్ 5న డ్రమ్స్ శివమణికి సత్కారం

ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో డిసెంబరు 5న విజయనగరంలో ఘంటసాల జయంత్యుత్సవాలు జరుగుతాయి. పద్మశ్రీ అవార్డు గ్రహీత డ్రమ్స్ శివమణిని ఆరోజు సత్కరించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.భీష్మారావు తెలిపారు. ముందుగా గుమ్చీ కూడలిలోని ఘంటసాల విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం ఆనందగజపతి ఆడిటోరియంలో 12 గంటల స్వరాభిషేకం, సాయంత్రం శివమణి సంగీత కార్యక్రమం చేపట్టనున్నారు.
News November 27, 2025
WPL మెగా వేలంలో అమ్ముడుపోని హీలీ.. దీప్తికి రూ.3.2 కోట్లు

WPL మెగా వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీకి షాక్ తగిలింది. వేలంలో ఆమెను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాకపోవడంతో Unsoldగా మిగిలారు. భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తిని రూ.3.2 కోట్లకు యూపీ వారియర్స్ సొంతం చేసుకుంది. మరోవైపు సౌతాఫ్రికా కెప్టెన్ లారాను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.10కోట్లకు దక్కించుకుంది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ సోఫీ డివైన్‌ను రూ.2 కోట్లకు గుజరాత్ కొనుగోలు చేసింది.


