News February 4, 2025
NRPT: రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి హత్య

నారాయణపేట పట్టణంలో వ్యక్తి హత్య కలకలం రేపుతోంది. సీఐ శివశంకర్ తెలిపిన వివరాలు.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన విక్రమ్ సింగ్ అనే వ్యక్తి టైల్స్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. సోమవారం ఐదుగురు పండ్ల వ్యాపారులు విక్రమ్ సింగ్‌ను గ్రౌండ్ లోకి తీసుకెళ్ళి కొట్టి చంపినట్లు చెప్పారు. మృతి చెందిన వ్యక్తి బావమరిది శివరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Similar News
News October 28, 2025
తుఫాన్లలోనూ ఆగని విద్యుత్.. భూగర్భ కేబుల్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన

మధిర పట్టణంలో విద్యుత్ రంగాన్ని ఆధునీకరించేందుకు రూ.27.76 కోట్ల వ్యయంతో చేపట్టనున్న భూగర్భ విద్యుత్ కేబుల్ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం శంకుస్థాపన చేశారు. భారీ వర్షాలు, తుఫాన్ల సమయంలో కూడా విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేయడమే లక్ష్యమన్నారు. మొత్తం 3.5 కి.మీ 33 కేవీ, 17.3 కి.మీ 11 కేవీ, 15 కి.మీ ఎల్‌టీ లైన్లను భూగర్భంలో వేయనున్నట్లు తెలిపారు.
News October 28, 2025
తుంగతుర్తి: ‘టీకాలతోనే గాలికుంటు వ్యాధి నివారణ’

పశువులకు సమయానికి టీకాలు వేస్తే గాలికుంటు వ్యాధి నివారించవచ్చని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండలం సంగెంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసి మాట్లాడారు. పశువుల్లో గాలికుంటు వ్యాధి సోకితే పాల ఉత్పత్తి తగ్గిపోతుందన్నారు. 82 పశువులకు టీకాలు వేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నరేష్, గోపాలమిత్రలు పాల్గొన్నారు.
News October 28, 2025
కరీంనగర్‌లో పీజీ వైద్య విద్యార్థి ఆత్మహత్య

కరీంనగర్ ప్రతిమ వైద్య కళాశాలలో పీజీ ద్వితీయ సంవత్సరం అనస్తీషియా విభాగంలో చదువుతున్న శ్రీనివాస్ అనే వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మత్తు ఇంజక్షన్ తీసుకుని తన గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషాదం సంఘటనతో కళాశాల పరిసరాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


