News February 4, 2025
NRPT: రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి హత్య

నారాయణపేట పట్టణంలో వ్యక్తి హత్య కలకలం రేపుతోంది. సీఐ శివశంకర్ తెలిపిన వివరాలు.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన విక్రమ్ సింగ్ అనే వ్యక్తి టైల్స్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. సోమవారం ఐదుగురు పండ్ల వ్యాపారులు విక్రమ్ సింగ్‌ను గ్రౌండ్ లోకి తీసుకెళ్ళి కొట్టి చంపినట్లు చెప్పారు. మృతి చెందిన వ్యక్తి బావమరిది శివరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Similar News
News February 8, 2026
సిద్దిపేట: టీ మాస్ నూతన కమిటీ ఎన్నిక

సిద్దిపేటలో ప్రాక్టీస్ చేస్తున్న మాదిగ న్యాయవాదులతో సమావేశం నిర్వహించి తెలంగాణ మాదిగ అడ్వకేట్స్ సంఘం (టీ మాస్)ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ సలహాదారులుగా భూమిగారి మనోహర్, భూపతి, చింతమడక కన్నయ్య, యాదగిరి ఎంపికయ్యారు. వ్యవస్థాపక జిల్లా అధ్యక్షునిగా కర్రోల్ల రవిబాబు, ఉపాధ్యక్షులుగా జేరిపోతుల యాదగిరి, రమేష్, సురేందర్, శ్రీనివాస్, యుగంధర్‌ను నియమించారు.
News February 8, 2026
గౌడన్న.. కల్లు ఎంతకు అమ్ముతున్నావు?: మంత్రి తుమ్మల

‘గౌడన్న కల్లు ఎంతకు అమ్ముతున్నావు? రక్షణ కిట్లు మీ పొన్నం సార్ పంపించారా’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓ గీత కార్మికుడిని అడిగిన ప్రశ్నలు ఇవి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్లకు వస్తున్న మంత్రి కాన్వాయ్‌ని రగుడు ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ వద్ద అధికారులు తనిఖీ చేశారు. రగుడుకు చెందిన ఓ గీత కార్మికుడు తుమ్మలను కలిసి రక్షణ కిట్లు అందాయని, రూ.100కు లీటర్ కల్లు అమ్ముతున్నానని మంత్రికి తెలిపాడు.
News February 8, 2026
వనపర్తి: మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోరు!

వనపర్తి మున్సిపల్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ఈ నెల 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య బలమైన త్రిముఖ పోటీ నెలకొంది. అగ్రనేతల పేర్లతో అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తుండగా, స్వతంత్ర అభ్యర్థులు ఎవరి ఓట్లు చీలుస్తారో అన్న ఉత్కంఠ సర్వత్ర వ్యక్తమవుతోంది.


